ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిSP Rajesh Chandra | ఎస్సై, ఏఎస్సై సంతకాల ఫోర్జరీ.. కానిస్టేబుల్ సస్పెన్షన్​

    SP Rajesh Chandra | ఎస్సై, ఏఎస్సై సంతకాల ఫోర్జరీ.. కానిస్టేబుల్ సస్పెన్షన్​

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి: SP Rajesh Chandra | ఎస్సై, ఏఎస్సై సంతకాలను ఫోర్జరీ చేస్తూ దుర్వినియోగానికి పాల్పడుతున్న పెద్ద కొడప్​గల్ (Pedda kodapkal) కానిస్టేబుల్ రవికుమార్​ను (Constable Ravikumar) సస్పెండ్ చేస్తూ ఎస్పీ రాజేష్ చంద్ర సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దకొడప్​గల్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న సమయంలో కానిస్టేబుల్ కె.రవికుమార్ బస్సు వారంట్ల కోసం ఏఎస్సై సంతకాలను ఫోర్జరీ చేశాడు.

    అలాగే విధులకు గైర్హాజరైనప్పుడు ఉన్నతాధికారులకు ఎస్సై సంతకాలను ఫోర్జరీ చేసి తప్పుడు నివేదికలు పంపించాడు. ఇలా కానిస్టేబుల్​పై వచ్చిన ఆరోపణలపై బాన్సువాడ డీఎస్పీ నివేదికను పరిశీలించిన ఎస్పీ రాజేష్ చంద్ర తీవ్రంగా పరిగణించారు. ప్రస్తుతం దేవునిపల్లి పోలీసు స్టేషన్​లో (Devunipalli Police Station) విధులు నిర్వహిస్తున్న రవికుమార్​ను సస్పెండ్​ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విధి నిర్వహణలో ఎవరైనా బాధ్యతారాహిత్య ప్రవర్తన లేదా చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే శాఖాపరమైన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.

    More like this

    Hydraa | 600 గ‌జాల స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో ప్రభుత్వ, ప్రజా ఆస్తులను హైడ్రా అధికారులు కాపాడున్నారు....

    Revanth meet Nirmala | కళాశాలల్లో అత్యాధునిక ల్యాబ్​ల ఏర్పాటుకు రూ. 9 వేల కోట్లు..!

    అక్షరటుడే, హైదరాబాద్: Revanth meet Nirmala : తెలంగాణ విద్యా రంగంలో స‌మూల‌ మార్పులు తేవ‌డానికి తాము చేస్తున్న‌...

    Nara Lokesh | కేటీఆర్​ను కలిస్తే తప్పేంటి.. ఏపీ మంత్రి లోకేష్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nara Lokesh | మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ (KTR)​ను కలిస్తే...