HomeUncategorizedKalvakuntla Kavitha | రైతులపై ఫారెస్ట్ అధికారులు వేధింపులు ఆపాలి: కల్వకుంట్ల కవిత

Kalvakuntla Kavitha | రైతులపై ఫారెస్ట్ అధికారులు వేధింపులు ఆపాలి: కల్వకుంట్ల కవిత

రైతులపై అటవీశాఖాధికారుల వేధింపులు ఆపాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్​ చేశారు. మోపాల్​ మండలం ’జనంబాట’లో భాగంగా రెండవరోజు ఆమె పర్యటించారు.

- Advertisement -

అక్షరటుడే, డిచ్​పల్లి: Kalvakuntla Kavitha | సాగులో ఉన్న పోడు భూములకు ప్రభుత్వం వెంటనే పట్టాలు ఇవ్వాలని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లాలో (Nizamabad jagruthi) ఆదివారం రెండో రోజు తెలంగాణ జాగృతి (Telangana Jagruthi) ‘జనంబాట’లో (Janam bata) భాగంగా ఆమె మోపాల్ మండలం భైరాపూర్​లో పర్యటించారు. గ్రామ పరిధిలో మోతీరాం తండాకు చెందిన పోడు బాధిత రైతు ప్రకాశ్​ కుటుంబాన్ని పరామర్శించి పంట పొలాన్ని పరిశీలించారు.

Kalvakuntla Kavitha | చేతికొచ్చిన పంటపై గడ్డిమందు చల్లుతారా..?

చేతికి వచ్చిన మొక్కజొన్న పంటపై గడ్డి మందు చల్లి అటవీ శాఖ అధికారులు ధ్వంసం చేయడంపై కవిత మండిపడ్డారు. బాధిత రైతు ప్రకాశ్​​కు వెంటనే పంటనష్టపరిహారం ఇవ్వాలని కలెక్టర్​ వినయ్​కృష్ణారెడ్డిని కోరారు.

మంచిప్ప రిజర్వాయర్ ముంపు తీవ్రతను తగ్గిస్తామని చెప్పిన రేవంత్​రెడ్డి ఎందుకు ముంపు గ్రామాల పోడు భూములకు పట్టాలు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. అత్యుత్సాహంతో ఫారెస్ట్ అధికారులు గిరిజన రైతులను వేధించడం తగదన్నారు. ఆమె వెంట జాగృతి నాయకులు శ్రీనివాస్ గౌడ్, నరేష్ తదితరులున్నారు.