అక్షరటుడే, ఆర్మూర్ : Siddhula Gutta | సిద్దుల గుట్టపై సోమవారం చిరుత పులి(Leopard) సంచారం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఆర్మూర్ ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. ఈ నేపథ్యంలో ఫారెస్ట్ అధికారులు(Forest officers) మంగళవారం గుట్ట ప్రాంతాలను సందర్శించారు. అనంతరం కోనేరు పరిసరాలను పరిశీలించారు. చిరుత సంచారాన్ని తెలుసుకునేందుకు ట్రాప్ కెమెరా(Trap Camera)లను ఏర్పాటు చేస్తున్నట్లు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్(Forest Range Officer Srinivas) తెలిపారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు పలు సూచనలు చేశారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్, ఆలయ కమిటీ సభ్యులు సుమన్, చరణ్, పవన్ తదితరులు పాల్గొన్నారు.
Siddhula Gutta | చిరుత కలకలం.. సిద్దులగుట్టను పరిశీలించిన ఫారెస్ట్ అధికారులు
Published on
