అక్షరటుడే, వెబ్‌డెస్క్ : ACB Raid | ఏసీబీ వలకు మరో అవినీతి తిమింగలం చిక్కింది. రూ.3.51 లక్షల లంచం తీసుకుంటుండగా.. అటవీ శాఖ అధికారిని ఏసీబీ అధికారులు (ACB officials) రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
అవినీతి అధికారులు మారడం లేదు. తమ వద్దకు పనుల కోసం వచ్చే వారిని లంచాలు (bribes) డిమాండ్ చేస్తున్నారు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో (Bhadradri Kothagudem district) ఏసీబీ అధికారులు దాడులు చేశారు. కొత్తగూడెం అటవీ సబ్-డివిజన్ ప్లాంటేషన్ మేనేజర్ తాడి రాజేందర్, ప్రైవేట్ వ్యక్తి చెన్నం గోపాల కృష్ణను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఓ వ్యక్తి సుమారు 3,900 టున్నల నీలగిరి చెట్లను నరికివేయడానికి కావాల్సిన బిల్లుల కోసం దరఖాస్తు చేసుకున్నాడు. దీనికోసం కొత్తగూడెం ఫారెస్ట్ డివిజనల్ మేనేజర్ తాటి శ్రావణి రూ. 3.51 లక్షల లంచం డిమాండ్ చేశారు.
దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదుదారుడి నుంచి శనివారం రూ.3.51 లక్షలు తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు ప్లాంటేషన్ మేనేజర్ రాజేందర్, ప్రైవేట్ వ్యక్తి గోపాల కృష్ణ సూచనల మేరకు జోగు చెన్నారావు అనే వ్యక్తి లంచం మొత్తం రూ. 3,51,000 తీసుకున్నాడు. దీంతో ఏసీబీ అధికారులు ఈ కేసులో రాజేందర్, గోపాల కృష్ణను అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితురాలు తాటి శ్రావణి పరారీలో ఉన్నారు. ఆమె కోసం అధికారులు గాలిస్తున్నారు.
ACB Raid | లంచం ఇవ్వొద్దు
ప్రజలు అధికారులకు లంచాలు ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు (ACB Officers) సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే భయపడకుండా ఏసీబీకి ఫోన్ చేయాలని చెబుతున్నారు. 1064 టోల్ ఫ్రీ నంబర్ (ACB Toll Free Number), వాట్సాప్ నంబర్ 9440446106కు సమాచారం అందిస్తే అవినీతి అధికారుల పని పడతామని భరోసా ఇస్తున్నారు. ఏసీబీ వెబ్సైట్ (ACB Website) ద్వారా కూడా ఫిర్యాదు చేయొచ్చని తెలిపారు.