అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Forest Officer Suspension | అవినీతి ఆరోపణలపై విచారణ చేపట్టిన అటవీశాఖ అధికారులు (forest department officials) సెక్షన్ ఆఫీసర్‌ను సస్పెండ్ చేశారు. సిరికొండ (Sirikonda) రేంజ్ పరిధిలోని పందిమడుగు సెక్షన్ ఆఫీసర్ సాయికిరణ్‌పై అవినీతి ఆరోపణలు రావడంతో వేటు వేశారు.
Forest Officer Suspension | భూఆక్రమణలు.. కలప అక్రమ నిల్వలు..
పందిమడుగు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్‌గా (Pandimadugu Forest Section Officer) విధులు నిర్వహిస్తున్న సాయికిరణ్‌పై ఆది నుంచి అవినీతి ఆరోపణలు ఉన్నాయి. తన రేంజ్ పరిధిలో భూఆక్రమణలు చేస్తున్నారని ఉన్నతాధికారులు ఫిర్యాదులు వెళ్లాయి. అలాగే అటవీసందపను కొల్లగొట్టి కలపను అక్రమంగా నిల్వ ఉంచడం.. గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అలాగే అక్రమ గృహ నిర్మాణాలకు సహకరిస్తున్నారని అధికారులకు సమాచారం అందింది.
Forest Officer Suspension | విచారణ చేపట్టిన అధికారులు..
ఫారెస్ట్ సెక్షన్ అధికారి సాయికిరణ్‌పై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడంతో స్పందించిన ఉన్నతాధికారులు అంతర్గత విచారణకు ఆదేశించారు. ఈ మేరకు విచారణలో భాగంగా ఆయనను సస్పెండ్ చేస్తున్నట్లు అటవీశాఖ చీఫ్ కన్జర్వేటర్ శరవణన్ రెండురోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేశారు.