ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిForest land Encroachment | అటవీ భూముల అన్యాక్రాంతం

    Forest land Encroachment | అటవీ భూముల అన్యాక్రాంతం

    Published on

    అక్షరటుడే, బాన్సువాడ : Forest land Encroachment | అక్షరటుడే, బాన్సువాడ : అడవుల్లో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ఇష్టారాజ్యంగా చెట్లను తొలగించి కబ్జాలకు పాల్పడుతున్నారు. ట్రాక్టర్లతో భూములను చదును చేసి దర్జాగా పంటలు సాగు (cultivating crops) చేస్తున్నారు. అయినా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం.

    అంతరించిపోతున్న అడవులను కాపాడుకోవాలనే లక్ష్యంతో గత ప్రభుత్వ హయాంలో అటవీ భూముల్లో పెద్దఎత్తున మొక్కలు నాటారు. హరితహారంలో (Haritha Haram) భాగంగా మొక్కలు నాటడానికి రూ. వందల కోట్లు ఖర్చు పెట్టారు. అయితే ప్రస్తుతం అటవీ భూముల్లో (forest lands) నాటిన మొక్కలను పట్టించుకునే వారు కరువయ్యారు. దీంతో కొందరు అటవీ భూములపై కన్నేశారు. పచ్చని చెట్లు కొట్టేసి.. భూములను చదును చేస్తున్నారు. ఫారెస్ట్‌ భూముల్లో పంటలు సాగు చేస్తున్నారు. అయినా అటవీశాఖ అధికారులు (forest department officials) అటువైపు వెళ్లడం లేదు.

    Forest land encroachment | అధికారుల నిర్లక్ష్యం

    అటవీ శాఖ అధికారులు (forest department officials) కార్యాలయాలకే పరిమితం అవుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అడవులు కబ్జాకు గురవుతున్నా ఫారెస్ట్‌ అధికారులు గుర్తించలేకపోతున్నారు. అప్పుడప్పుడు వచ్చి గ్రామాల్లో తిరిగి వెళ్తున్నారు.. తప్పా అటవీ ప్రాంతంలోకి (forest area) వెళ్లి పరిశీలించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఎవరైనా ఫిర్యాదు చేస్తే తప్పా అటవీ భూముల కబ్జా విషయం అధికారులకు తెలియని పరిస్థితి ఉంది. ఇదే అదునుగా అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. చెట్లను నరికి భూములను చదును చేస్తున్నారు. ఆయా భూముల్లో పంటలు కూడా వేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంతోనే అటవీ భూములు అన్యాక్రాంతం అవుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

    Forest land encroachment | బాన్సువాడ మండలంలో..

    బాన్సువాడ మండలం (Banswada mandal) హన్మాజిపేట్‌ గ్రామ అటవీ భూముల్లో ఐదేళ్ల క్రితం 60 ఎకరాల్లో మొక్కలు నాటారు. కొంతమంది ఆ మొక్కల ను తొలగించారు. ప్లాంటేషన్‌ భూములను చదును చేసి పంటలు పండిరచుకుంటున్నారు. బాన్సువాడ మండలం సంగోజీపేట (Sangojipet) శివారు లోని అడవిలో అక్రమార్కులు భారీ వృక్షాలను నరికేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేద నే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కబ్జాదారులకు అధికారులు అండగా నిలుస్తుండడంతో అడవులు అంతరించిపోతున్నాయి. గతంలో ఫారెస్ట్‌ అధికారులు స్వాధీనం చేసుకున్న అటవీ భూములను సైతం కొందరు మళ్లీ ఆక్రమించుకుంటున్నారు. అటవీ శాఖాధికారులు (forest officials) చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

    Forest land encroachment | కేసులు నమోదు చేస్తాం

    – హబీబ్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, బాన్సువాడ

    హన్మాజీపేట్‌ అటవీ భూముల్లో గతంలో ప్లాంటేషన్‌ చేసిన మొక్కలను కొందరు చదును చేసి సోయా పంట వేశారు. వారిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం. గ్రామం నుంచి పారిపోయినట్లు తెలిసింది. వారిపై కేసు నమోదు చేస్తాం. వేసిన పంటను దున్నేస్తాం.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...