అక్షరటుడే, ఇందూరు: Forest Department | జిల్లా అటవీశాఖ అధికారుల డైరీని శనివారం ఆవిష్కరించారు. జిల్లాకేంద్రంలోని వర్ని రోడ్లో జిల్లా అటవీశాఖ (Forest Department) కాంప్లెక్స్‌లో బాసర సర్కిల్ సీసీఎఫ్ శరవణన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వన్యప్రాణుల సంరక్షణ, అటవీ సంపద పరిరక్షణ, అడవుల్లో అగ్నిప్రమాదాల నివారణ వంటి కీలక అంశాలపై శాఖ సిబ్బందితో విస్తృతంగా చర్చించారు.
Forest Department | వేసవికాలంలో..
రానున్న వేసవికాలంలో (summer season) అడవుల్లో మంటలు చెలరేగకుండా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని అటవీశాఖ సిబ్బందికి సీసీఎస్ శరవణన్ సూచించారు. ఫారెస్ట్ సిబ్బంది తమ విధి నిర్వహణలో క్రమశిక్షణ, బాధ్యత, అంకితభావంతో పనిచేయాలని గుర్తు చేశారు. అడవుల రక్షణతో పాటు వన్యప్రాణుల సంరక్షణ కూడా తమ ప్రధాన కర్తవ్యమని సీసీఎఫ్ స్పష్టం చేశారు. అటవీ పరిరక్షణలో ప్రభుత్వ విధానాలను (government policies) క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఎఫ్‌వో వికాస్ మీన, ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్లు సుధాకర్ రావు, భవానీ శంకర్, ఫారెస్ట్ రేంజ్ అధికారులు శ్రీనివాస్, రవిమోహన్‌భట్, రవీందర్, గంగాధర్, జూనియర్ ఫారెస్ట్ అసోసియేషన్ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.