More
    HomeజాతీయంForeign exchange | విదేశీ మారక నిల్వలు పైపైకి.. 688 బిలియన్‌ డాలర్లకు చేరిక

    Foreign exchange | విదేశీ మారక నిల్వలు పైపైకి.. 688 బిలియన్‌ డాలర్లకు చేరిక

    Published on

    అక్షరటుడే వెబ్ డెస్క్: Foreign exchange | రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(Reserve Bank of India) విడుదల చేసిన వీక్లీ స్టాటిస్టికల్‌ సప్లిమెంట్‌ ప్రకారం మన విదేశీ మారక నిల్వలు(ఫారెక్స్‌) ఏప్రిల్‌ 25తో ముగిసిన వారానికి 688.13 బిలియన్‌ అమెరికన్‌ డాలర్లకు చేరాయి. ఇది అంతకుముందు వారంతో పోల్చితే 1.98 బిలియన్‌ డాలర్లు ఎక్కువ. కాగా మన ఫారెక్స్‌(Forex) నిల్వలు ఇటీవలి కాలంలో స్థిరంగా పెరుగుతున్నాయి. వరుసగా ఎనిమిదో వారంలోనూ నిల్వలు పెరిగినట్లు ఆర్‌బీఐ సప్లిమెంట్‌ RBI supplement స్పష్టం చేస్తోంది. ఇది ఆరునెలల గరిష్ట స్థాయి. డాలర్‌(Dollar) విలువ క్షీణిస్తుండడంతోపాటు రూపాయి(Rupee) విలువ బలపడుతుండడంతో వచ్చే వారంలోనూ ఫారెక్స్‌ నిల్వలు పెరిగే అవకాశాలున్నాయి.

    Foreign exchange | సెప్టెంబర్‌లో గరిష్ట స్థాయిలో..

    మన విదేశీ మారక నిల్వలు foreign exchange reserves గతేడాది సెప్టెంబర్‌లో ఆల్‌టైం హై(All time high)కి చేరుకున్నాయి. సెప్టెంబర్‌లో 704.89 బిలియన్‌ డాలర్ల నిల్వలు ఉండేవి. అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చిత పరిస్థితులతో రూపాయి విలువ క్షీణించింది. దీంతో ఫారెక్స్‌ నిల్వలు సైతం తగ్గుతూ వచ్చాయి. జనవరి చివరి వారంలో 631 బిలియన్‌ అమెరికన్‌ డాలర్లకు పడిపోయాయి. అనంతరం ఆర్‌బీఐ తీసుకున్న చర్యలతో ఫిబ్రవరి(February)నుంచి నిల్వలు మళ్లీ పెరుగుతూ వస్తున్నాయి. ప్రస్తుతం 688.13 బిలియన్‌ అమెరికన్‌ డాలర్ల వద్ద ఉన్నాయి. బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా(Bank of America) అంచనా ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం financial year చివరి నాటికి మన ఫారెక్స్‌ నిల్వలు 745 బిలియన్‌ డాలర్లకు చేరుకోవచ్చు.

    Foreign exchange | తగ్గిన బంగారం విలువ..

    ఫారెక్స్‌ నిల్వలు forex reserves పెరుగుతుండగా.. బంగారం(Gold) నిల్వలు మాత్రం స్వల్పంగా తగ్గాయి. ఏప్రిల్‌ 25తో ముగిసిన వారంలో బంగారం నిల్వలు 207 మిలియన్‌ డాలర్లు million dollars తగ్గి 84.37 బిలియన్‌ డాలర్ల వద్ద స్థిరపడ్డాయి. మార్కెట్‌లో market గోల్డ్‌ ధరలు gold prices తగ్గుతుండడం, గోల్ట్‌ స్టాక్స్‌ gold stocks మదింపు పద్ధతుల వల్ల జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు.

    Foreign exchange | ఫారెక్స్‌ నిల్వల పెరుగుదలకు కారణాలు..

    • రూపాయి విలువ స్థిరీకరణ కోసం ఆర్‌బీఐ చర్యలు తీసుకుంటోంది. ఓపెన్‌ మార్కెట్‌ ఆపరేషన్స్‌(Open market operations) ద్వారా విదేశీ కరెన్సీని కొనుగోలు చేస్తోంది.
    • విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, ఫారిన్‌ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్‌మెంట్స్‌(Foreign Portfolio Investments) పెరుగుతున్నాయి. మన దేశ బాండ్లలో పెట్టుబడులు పెడుతున్నారు.
    • మన స్టాక్‌ మార్కెట్లలో stock market పెట్టుబడులు పెట్టడానికి విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు ఆసక్తి చూపుతున్నారు.
    • ఫారెక్స్‌ నిల్వలు పెరగడానికి విదేశాల్లో ఉన్న భారతీయులూ కారణమే.. వారు తాము సంపాదించిన డబ్బులను భారత్‌కు india పంపిస్తూ నిల్వలు పెరగడానికి కారణమవుతున్నారు.

    More like this

    CPM Nizamabad | తెలంగాణ సాయుధ పోరాట వారసులు కమ్యూనిస్టులు

    అక్షరటుడే, ఇందూరు: CPM Nizamabad | తెలంగాణ సాయిధ పోరాట వారసులు కమ్యూనిస్టులు మాత్రమేనని సీపీఎం జిల్లా కార్యదర్శి...

    Team India | టీమిండియాకి కొత్త స్పాన్స‌ర్ వ‌చ్చేశారు.. ఇక నుండి జెర్సీలు ఎలా ఉండ‌నున్నాయంటే..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Team India | భారత క్రికెట్ ప్రేమికులకు తాజా అప్‌డేట్! టీమిండియా క్రికెట్ జెర్సీపై ఇకపై...

    Birkur | గుడి డబ్బులు వడ్డీతో సహా చెల్లిస్తా: బీర్కూర్ మాజీ జెడ్పీటీసీ ద్రోణవల్లి సతీష్

    అక్షరటుడే, బాన్సువాడ: Birkur | బీర్కూర్ తెలంగాణ తిరుమల దేవస్థానానికి (Telangana Tirumala Tirupathi) సంబంధించి రూ.25 లక్షలు...