Homeబిజినెస్​Foreign Direct Investment | ఎఫ్‌డీఐల‌ ఆక‌ర్షణ‌లో ‘మ‌హా’ ముంద‌డుగు.. ద‌క్షిణాది రాష్ట్రాల్లోకే ఎక్కువ‌గా విదేశీ...

Foreign Direct Investment | ఎఫ్‌డీఐల‌ ఆక‌ర్షణ‌లో ‘మ‌హా’ ముంద‌డుగు.. ద‌క్షిణాది రాష్ట్రాల్లోకే ఎక్కువ‌గా విదేశీ పెట్టుబ‌డులు

- Advertisement -

అక్షరటుడే, న్యూఢిల్లీ: Foreign Direct Investment | విదేశీ ప్ర‌త్య‌క్ష పెట్టుబ‌డుల‌ను (FDI) ఆక‌ర్షించ‌డంలో ద‌క్షిణాది రాష్ట్రాలు ముందు వ‌రుస‌లో ఉన్నాయి. ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రంలో వ‌చ్చిన పెట్టుబ‌డుల్లో సింహ‌భాగం ఈ ప్రాంతానికే రావ‌డం గ‌మ‌నార్హం. 2025లో దేశంలోకి వ‌చ్చిన విదేశీ ప్ర‌త్య‌క్ష పెట్టుబ‌డుల్లో మ‌హారాష్ట్ర‌(Maharashtra), క‌ర్ణాట‌క(Karnataka) 51 శాతం వాటా క‌లిగి ఉండ‌డం విశేషం.

ప్ర‌ధానంగా మ‌హారాష్ట్ర‌లోకే అత్య‌ధికంగా పెట్టుబ‌డులు వ‌చ్చాయ‌ని పరిశ్రమ, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం తాజా గ‌ణంకాలు వెల్ల‌డించాయి. గత ఆర్థిక సంవత్సరంలో మహారాష్ట్ర గరిష్టంగా 19.6 బిలియ‌న్ డాల‌ర్ల విదేశీ పెట్టుబడులను ఆకర్షించింది. ఇది మొత్తం దేశంలోకి వ‌చ్చిన‌ FDIల‌లో 31 శాతం ఆ రాష్ట్రానికే రావ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. మరోవైపు, కర్ణాటక 6.62 బిలియన్ డాల‌ర్ల విదేశీ పెట్టుబడులను సంపాదించిన‌ట్లు తాజా గ‌ణంకాలు వెల్ల‌డించాయి.

Foreign Direct Investment | ఏడో స్థానంలో తెలంగాణ‌..

మ‌హారాష్ట్ర‌, క‌ర్ణాట‌క రాష్ట్రాల త‌ర్వాతి స్థానాల్లో ఢిల్లీ(6 బిలియన్ డాల‌ర్లు), గుజరాత్ (5.71 బిలియన్ డాల‌ర్లు), తమిళనాడు (3.68 బిలియన్ డాల‌ర్లు), హర్యానా (3.14 బిలియన్ డాల‌ర్లు) నిలిచాయి. ఇక‌, 3 బిలియన్ డాల‌ర్ల విదేశీ ప్ర‌త్య‌క్ష పెట్టుబ‌డులు ఆక‌ర్షించిన తెలంగాణ(Telangana) దేశంలో ఏడో స్థానం ద‌క్కించుకుంది.

మహారాష్ట్ర, కర్ణాటకలలో అధిక పెట్టుబడులకు ప్రధాన కారణం అక్క‌డ మౌలిక సదుపాయాల మెరుగు ప‌డ‌డ‌మేన‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. కొన్నేళ్లుగా ఈ రెండు రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాలు గణనీయంగా మెరుగుపడ్డాయి. ఫ‌లితంగా ఇండియా(India)లో అత్య‌ధికంగా విదేశీ ప్ర‌త్య‌క్ష పెట్టుబ‌డుల‌కు ఆకర్షణీయమైన గమ్యస్థానాలుగా మ‌హారాష్ట్ర‌, క‌ర్ణాట‌క నిలుస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.

గత ఆర్థిక సంవత్సరంలో ఈక్విటీ ఇన్‌ఫ్లోలు, తిరిగి పెట్టుబడి పెట్టిన ఆదాయాలు, ఇతర మూలధనంతో సహా మొత్తం FDI 14 శాతం పెరిగి 81.04 బిలియన్ డాల‌ర్ల‌కు చేరుకుంది. ఇది గత మూడేళ్లలో అత్యధికం. 2024లో 71.3 బిలియన్ డాల‌ర్ల ఎఫ్‌డీఐలు వ‌చ్చాయి.

Must Read
Related News