foot patrol
foot patrol | కామారెడ్డిలో ఫుట్ పెట్రోలింగ్ ర్యాలీ

అక్షరటుడే, కామారెడ్డి: foot patrol | జిల్లా కేంద్రంలో ఎస్పీ రాజేష్ చంద్ర(SP Rajesh chandra) ఆధ్వర్యంలో గురువారం రాత్రి ఫుట్ పెట్రోలింగ్(foot patrolling) ర్యాలీ నిర్వహించారు. రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ ధర్మశాల, పాంచ్ రస్తా, పెద్ద హరిజనవాడ, గొల్లవాడ, ఇస్లాంపూర్, కసాబ్ గల్లి, రైల్వే కమాన్ మీదుగా నిజాంసాగర్ చౌరస్తా వరకు సాగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. కామారెడ్డితో పాటు బాన్సువాడ, ఎల్లారెడ్డి పట్టణాల్లో ఫుట్ పెట్రోలింగ్ ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణతో పాటు బక్రీద్ పండుగ సందర్భంగా ఈ ర్యాలీ చేపట్టినట్లు పేర్కొన్నారు. ర్యాలీలో కామారెడ్డి సబ్​డివిజన్​ ఏఎస్పీ చైతన్య రెడ్డి(ASP Chaitanya reddy), పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.