అక్షరటుడే, వెబ్‌డెస్క్:Food Poisoning | నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని మహాత్మా జ్యోతిబా పూలే బాలికల గురుకుల పాఠశాల (Mahatma Jyotiba Phule Girls Gurukul School) విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కడుపునొప్పి, వాంతులతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. శనివారం సాయంత్రం స్నాక్స్‌గా ఇచ్చిన పకోడీ, రాత్రి క్యాబేజీ కూరతో (Cabbage Curry) రైస్ పెట్టడంతో డైజేషన్ కాక కడుపునొప్పి, వాంతులతో ఇబ్బందులు పడ్డారు. గమనించిన సిబ్బంది హుటాహుటిన రాత్రి నాగర్ కర్నూల్ జనరల్ ఆసుపత్రికి (Nagar Kurnool General Hospital) తరలించారు. ఆదివారం ఉదయం కూడా మరి కొంతమంది విద్యార్థులకు వాంతులు కావడంతో వారిని కూడా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
Food Poisoning | 100 మందికి చికిత్స
పాఠశాలలో ఆహారం తిన్న విద్యార్థులు (Students) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కడుపునొప్పితో వాంతులతో విద్యార్థులు అలమటించారు. విద్యార్థులు అస్వస్థతకు గురవగా ప్రారంభంలోనే హాస్పిటల్ కు తరలించకపోవడంతో చాలామంది విద్యార్థులు నొప్పి భరించలేక రోధించారు. చివరకు సిబ్బంది విద్యార్థులను దవాఖానాకు తరలించగా, ఫుడ్ పాయిజన్(Food Poison) అయినట్లు వైద్యులు గుర్తించారు. మెనూ ప్రకారం భోజనం వడ్డించక పోవడం, మొన్నటి పాలలో పెరుగు తోడేయడం, క్యాబేజీతో పకోడా వంటి పదార్థాలు పెట్టడంతో డైజేషన్ కాక అందరికీ కడుపునొప్పి, వాంతులు చేసుకున్నారని వైద్యులు నిర్ధారించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం స్నాక్స్ భోజనం వడ్డించకపోవడం వల్లే అస్వస్థతకు గురైనట్లు ఆరోపణలు వస్తున్నాయి. విషయం తెలుసుకున్న విద్యార్థినుల తల్లిదండ్రులు ఆసుపత్రికి చేరుకున్నారు.
Food Poisoning | నిలకడగానే విద్యార్థుల ఆరోగ్యం
దాదాపు 100 మంది విద్యార్థులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రాత్రి 79 మంది విద్యార్థులు అస్వస్థతకు గురవగా ఆస్పత్రికి తరలించారు. అందులో 12 మందిని డిశ్చార్జ్ చేశారు. 67 మందికి రాత్రి ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. ప్రస్తుతం అందరూ విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు.

