16
అక్షరటుడే, కామారెడ్డి: Food Commission team | తెలంగాణ ఫుడ్ కమిషన్ బృందం శుక్రవారం (ఫిబ్రవరి 20) కామారెడ్డి జిల్లాలో పర్యటించనుంది. కమిషన్ ఛైర్మన్, సభ్యులు ఉదయం 9:30 గంటలకు కామారెడ్డి పట్టణంలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ కు చేరుకోనున్నారు.
Food Commission team | ఎక్కడెక్కడ పర్యటిస్తారంటే..
బ్రేక్ ఫాస్ట్ అనంతరం ఉదయం 10:30 గంటలకు మున్సిపల్ క్యాంటిన్లో ప్రజలకు విక్రయిస్తున్న పదార్థాల ధరలను తనిఖీ చేస్తారు. 11 గంటలకు జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేయనున్నారు.
మధ్యాహ్నం 12 గంటలకు రాజీవ్ నగర్ కాలనీలోని అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలిస్తారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 1 గంటలకు రామారెడ్డి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాని వెళ్తారు. కలెక్టరేట్లో మధ్యాహ్నం 3 గంటలకు అధికారులతో సమీక్షిస్తారు.