ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిSP Rajesh Chandra | సమస్యాత్మక ప్రాంతాలపై దృష్టి సారించాలి : ఎస్పీ రాజేష్​​ చంద్ర

    SP Rajesh Chandra | సమస్యాత్మక ప్రాంతాలపై దృష్టి సారించాలి : ఎస్పీ రాజేష్​​ చంద్ర

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి : SP Rajesh Chandra | రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల (Local Body Elections) కోసం ముందస్తు ప్రణాళికలు రూపొందించడంతో పాటు సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం ఆయన నెలవారీ సమీక్ష నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న కేసులపై సమీక్షించారు. ముఖ్యంగా గ్రేవ్ కేసుల్లో ఎస్​వోపీ ప్రకారం దర్యాప్తు జరగాలని సూచించారు.

    వీపీవోలు గ్రామాల్లో సందర్శించినప్పుడు ప్రజాప్రతినిధులు, యువజన సంఘాలతో కలిసి వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి, సమాచారం వేగంగా చేరేలా చూడాలన్నారు. సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయా లేదా పరిశీలించి రిపేర్ అవసరమైతే వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గొడవలకు కారణమయ్యే వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలని, చిన్న ఘటనకైనా సమాచారం వచ్చే విధంగా గ్రామస్థులతో సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు.

    SP Rajesh Chandra | ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు

    స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని ఎస్పీ సూచించారు. ప్రతి పోలీస్ అధికారి గ్రామాల పరిస్థితులను ముందుగానే అంచనా వేసి, సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు. సోషల్ మీడియాలో అసాంఘిక ప్రచారంపై పటిష్ట నిఘా ఉంచాలని సూచించారు.

    SP Rajesh Chandra | సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి

    డయల్ 100 (Dial 100) ద్వారా కాల్ వచ్చిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు అండగా నిలవాలని ఎస్పీ సూచించారు. సైబర్ నేరాలపై (Cyber Crimes) అవగాహన కల్పించే కార్యక్రమాలు రెగ్యులర్‌గా నిర్వహించాలన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు క్రమం తప్పకుండా నిర్వహించాలని ఆదేశించారు. అనంతరం ఎస్‌హెచ్‌వో వాహనాలను తనిఖీ చేశారు. ప్రతి వెహికల్‌ను రెగ్యులర్ సర్వీస్ చేయించాలన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ నరసింహారెడ్డి, ఏఎస్పీ చైతన్య రెడ్డి, డీఎస్పీలు శ్రీనివాసరావు, విఠల్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

    More like this

    Sub Collector Vikas Mahato | పీహెచ్​సీ సబ్​సెంటర్​ నిర్మాణం కోసం స్థల పరిశీలన

    అక్షరటుడే, కోటగిరి: Sub Collector Vikas Mahato | పోతంగల్ (Pothangal)​ మండలంలోని హెగ్డేలి(Hegdely) గ్రామానికి మంగళవారం బోధన్​...

    Maggari Hanmandlu | బీఆర్​ఎస్​కు షాక్​.. పార్టీకి సొసైటీ ఛైర్మన్​ రాజీనామా

    అక్షరటుడే, బోధన్​: Maggari Hanmandlu | జిల్లాలో బీఆర్​ఎస్ (Brs Nizamabad)​ పార్టీలో తొలి రాజీనామా నమోదైంది.  కేసీఆర్​...

    Nepal PM Resigns | నేపాల్‌ ప్రధాని కేపీ శర్మ ఓలి రాజీనామా

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nepal PM Resigns | నేపాల్​ ప్రధాని కేపీ శర్మ ఓలి తన పదవికి...