అక్షరటుడే, ఇందూరు: Government junior colleges | ఇంటర్ ఫస్టియర్లో అడ్మిషన్లపై దృష్టి సారించాలని జిల్లా ఇంటర్ విద్యాధికారి రవికుమార్ తెలిపారు. బుధవారం డీఐఈవో కార్యాలయంలో (DIEO Office) ప్రభుత్వ కళాశాలల ప్రిన్సిపాళ్లతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెకండియర్ విద్యార్థుల తరగతిలు పగడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ విద్యా సంవత్సరం అడ్మిషన్ల సంఖ్య 25 శాతం పెంచాలని సూచించారు. అధ్యాపకుల సమయపాలన, హాజరు, పనితీరుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. కళాశాలలో అవసరమైన మరమ్మతులు, పాఠ్యపుస్తకాల పంపిణీ, ప్రయోగశాల నిర్వహణకు సంబంధించి పూర్తి వివరాలతో నివేదికగా అందజేయాలన్నారు.
Comments are closed.