అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy SP | ఇటీవల జిల్లాలో జరుగుతున్న ఆస్తి సంబంధిత నేరాలపై ప్రత్యేక దృష్టి పెట్టి, చోరీలు జరుగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) అన్నారు. రాజంపేట పోలీస్ స్టేషన్‌ను (Rajampet Police Station) సోమవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు.
పోలీస్‌స్టేషన్‌లో రోల్‌కాల్ పరిశీలించి, సిబ్బంది హాజరు, క్రమశిక్షణ, సమయ పాలనపై సూచనలు చేశారు. ప్రతి పోలీస్ సిబ్బంది శుభ్రమైన యూనిఫాం ధరించి వృత్తిగౌరవం కాపాడాలని ఆదేశించారు. తమ సూచనలు సిబ్బందికి పూర్తిగా చేరుతున్నాయా లేదా అనే విషయాన్ని సీఐ,ఎస్సైలను (CIs and SIs) స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి ఫిర్యాదులపై వేగంగా స్పందించాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా నేరాల నియంత్రణకు కృషి చేయాలని సూచించారు. ఈ తనిఖీలో కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పీ చైతన్య రెడ్డి (ASP Chaitanya Reddy), భిక్కనూరు సీఐ సంపత్, ఎస్సై రాజు, సిబ్బంది పాల్గొన్నారు.
