అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy SP | పోలీసులు తమ విధుల్లో క్రమశిక్షణ, నిబద్ధతపై దృష్టి పెట్టాలని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) అన్నారు. ఆయన రాజంపేట పోలీస్ స్టేషన్(Rajampet Police Station)ను సోమవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మొదట రోల్ కాల్‌ను పరిశీలించి హాజరు, గైర్హాజరైన సిబ్బంది వివరాలు తెలుసుకున్నారు. మానవ వనరులను పూర్తిస్థాయిలో వినియోగం, రోల్ కాల్ ప్రాముఖ్యతను వివరించారు.
సిబ్బందిలో నిబద్ధతను, క్రమశిక్షణను పెంపొందించడంలో రోల్ కాల్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. సిబ్బందితో అన్ని గ్రామాల సమాచారం, సస్పెక్ట్స్, రౌడీ షీటర్ల (suspects and rowdy sheeters) వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రతి కేసును నైపుణ్యంతో, నిజాయితీతో సమగ్రంగా విచారించి ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రతి పోలీస్ అధికారిపై ఉందన్నారు. ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించడం, ఫిర్యాదులపై వేగంగా స్పందించి తక్షణమే పరిష్కారం చూపే విధంగా చర్యలు తీసుకోవడం ద్వారా మెరుగైన పోలీసింగ్ సాధ్యమవుతుందని తెలిపారు.
బ్లూ కోల్ట్స్, పెట్రోకార్ (Blue Colts and Petrocars) విధుల్లో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పద చర్యలపై వెంటనే స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. విజిబుల్ పోలీసింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని, వీపీవోలు తమకు కేటాయించిన గ్రామాలను తరచూ సందర్శిస్తూ, సమాచార వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు. ప్రజల రక్షణనే ధ్యేయంగా భావిస్తూ విధుల్లో నిబద్ధత చూపాలన్నారు. డయల్ 100 ద్వారా అందే ఫిర్యాదులపై వేగంగా, సమర్థవంతంగా స్పందిస్తూ, ప్రజలకు విశ్వాసం కలిగించేలా వ్యవహరించాలన్నారు. ప్రజలు ప్రశాంత వాతావరణంలో దుర్గా నవరాత్రి ఉత్సవాలు (Durga Navratri festivities) జరుపుకునే విధంగా బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు.