అక్షర టుడే, ఇందల్వాయి: Indalwai mandal | తల్లిదండ్రులు తమ పిల్లల శారీరక ఎదుగుదలతోపాటు మానసిక ఎదుగుదలపై దృష్టి పెట్టాలని డీఎంఈ స్వామి సులోచన అన్నారు. శనివారం ఇందల్వాయి మండలంలోని ఎల్లారెడ్డి జెడ్పీ హైస్కూల్‌లో (Yellareddy ZP High School) విద్యార్థుల తల్లులకు పిల్లల పెంపకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పిల్లల ప్రవర్తనలో మార్పులు, వాటిని ఏ విధంగా సరిదిద్దాలి అనే అంశాలపై వివరించారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం చంద్రశేఖర్, ఉపాధ్యాయులు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ పూదరి శ్యామల, గ్రామ విద్యా కమిటీ సభ్యులు, విద్యార్థుల తల్లులు పాల్గొన్నారు.