అక్షరటుడే, వెబ్‌డెస్క్: Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్(Domestic stock market) మంగళవారం ఒడిదుడుకులకు లోనయ్యింది. రోజంతా లాభనష్టాల మధ్య ఊగిసలాడుతూ సాగింది. మంగళవారం ఉదయం సెన్సెక్స్ 123 పాయింట్ల లాభంతో ప్రారంభమైనా అమ్మకాల ఒత్తిడితో 348 పాయింట్లు కోల్పోయింది. అక్కడినుంచి కోలుకుని 362 పాయింట్లు ఎగబాకింది.
నిఫ్టీ(Nifty) 33 పాయింట్ల లాభంతో ప్రారంభమైనా అక్కడినుంచి 86 పాయింట్లు పడిపోయింది. కనిష్టాల వద్ద లభించిన మద్దతుతో కోలుకుని 87 పాయింట్లు పెరిగింది. చివరికి సెన్సెక్స్(Sensex) 42 పాయింట్ల నష్టంతో 85,524 వద్ద, నిఫ్టీ 4 పాయింట్ల లాభంతో 26,177 వద్ద స్థిరపడ్డాయి. అమెరికా వెనిజులా మధ్య, రష్యా ఉక్రెయిన్ల మధ్య జియో పొలిటికల్ టెన్షన్స్‌తో క్రూడ్ ఆయిల్(Crude oil) ధర పెరుగుతుండడం, రూపాయి విలువ స్వల్పంగా తగ్గడం, గత సెషన్లో ఎఫ్ఐఐలు తిరిగి నికర అమ్మకందారులుగా నిలవడం వంటి కారణాలతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించడంతో మార్కెట్ ఒడిదుడుకుల మధ్య సాగింది.
Stock Market | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..
బీఎస్ఈ(BSE)లో నమోదైన కంపెనీలలో 2,292 కంపెనీలు లాభపడగా 1,892 స్టాక్స్ నష్టపోయాయి. 181 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 107 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 85 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 7 కంపెనీలు అప్పర్ సర్క్యూట్‌ను, 7 కంపెనీలు లోయర్ సర్క్యూట్‌ను తాకాయి. బీఎస్ఈలో నమోదైన కంపెనీల సంపద విలువ రూ. లక్షల కోట్లు పెరిగింది.
Stock Market | ఐటీలో అమ్మకాలు..
బీఎస్ఈలో ఐటీ ఇండెక్స్(IT index) 0.70 శాతం, పీఎస్‌యూ బ్యాంక్ 0.37 శాతం, హెల్త్‌కేర్ 0.22 శాతం, రియాలిటీ 0.21 శాతం నష్టపోయాయి. ఇన్ఫ్రా 0.81 శాతం, కమోడిటీ ఇండెక్స్ 0.68 శాతం, యుటిలిటీ 0.59 శాతం, పీఎస్‌యూ 0.56 శాతం, మెటల్ ఇండెక్స్ 0.52 శాతం లాభాలతో ముగిశాయి. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.38 శాతం, లార్జ్ క్యాప్ ఇండెక్స్ 0.08 శాతం, మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.07 శాతం లాభంతో ముగిశాయి.
Stock Market | Top gainers..
బీఎస్ఈ సెన్సెక్స్‌లో 13 కంపెనీలు లాభాలతో ఉండగా.. 17 కంపెనీలు నష్టపోయాయి. ఐటీసీ(ITC) 1.27 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 1.15 శాతం, టాటా స్టీల్ 1.03 శాతం, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 0.94 శాతం, ఎన్టీపీసీ 0.78 శాతం పెరిగాయి.
Stock Market | Top losers..
ఇన్ఫోసిస్ 1.28 శాతం, ఎయిర్టెల్ 0.97 శాతం, అదాని పోర్ట్స్ 0.95 శాతం, సన్‌ఫార్మా 0.93 శాతం, టెక్ మహీంద్రా 0.88 శాతం నష్టపోయాయి.