అక్షరటుడే, వెబ్‌డెస్క్: Thailand floods | థాయ్‌లాండ్‌లో వరదలు బీభత్సం సృష్టించాయి. తొమ్మిది ప్రావిన్సుల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఇప్పటి వరకు 13 మంది మృతి చెందారు. మొత్తం 103 కమ్యూనిటీలకు రెడ్ ఫ్లాగ్ తరలింపు ఉత్తర్వులు జారీ చేశారు. మూడు రోజుల్లో 595 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడం గమనార్హం. వరుసగా రెండో సంవత్సరం తొమ్మిది థాయ్ ప్రావిన్సులు, మలేషియాలోని (Malaysia) ఎనిమిది రాష్ట్రాలను వరదలు ముంచెత్తాయి.
దీనితో రెండు దేశాలు దాదాపు 45,000 మందిని తరలించాల్సి వచ్చింది. థాయ్‌లాండ్‌లో 13 మంది చనిపోయారు. థాయిలాండ్‌లోని (Thailand) హాట్ యాయ్ నగరంలో వరద ఉధృతి అధికంగా ఉంది. దీంతో చాలా మంది గాయపడ్డారు. 600 మంది రోగులు చికిత్స పొందుతున్న ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రి (government hospital) మొదటి అంతస్తు వరకు నీరు చేరింది. దీంతో హెలిక్యాప్టర్ ద్వారా రోగులను తరలించే చర్యలు చేపట్టారు. ఆసుపత్రిలో రోగులు, బంధువులు వైద్య సిబ్బంది సుమారు 2,000 మంది ఉన్నారు. వారికి హెలిక్యాప్టర్ ద్వారా ఆహారం అందిస్తున్నారు. వరద తగ్గగానే పడవల ద్వారా వారిని తరలించే చర్యలు చేపడుతున్నారు. గత వారం హాట్ యాయ్ నగరంలో335 మి.మీ. వర్షం కురిసింది. 300 సంవత్సరాలలో ఇదే అత్యధికం కావడం గమనార్హం.
Thailand floods | వేగంగా సహాయక చర్యలు
థాయ్ సైన్యం, అధికారులు మంగళవారం సహాయక చర్యలు చేపట్టారు. విమానాలు, ట్రక్కుల కాన్వాయ్‌లు వైద్య సామగ్రి, సిబ్బందితో పాటు ఫ్లాట్-బాటమ్ బోట్లు (flat-bottomed boats), రబ్బరు బోట్లను హాట్ యాయ్ వైపు తరలిస్తున్నట్లు తెలిపింది. థాయ్‌లోని ఏకైక విమాన వాహక నౌక సహాయ చర్యల్లో పాల్గొంది. 2.1 మిలియన్లకు పైగా ప్రజలు వరదలతో ప్రభావితం అయ్యారు. దీంతో ప్రధాన మంత్రి అనుతిన్ చార్న్విరాకుల్ మంగళవారం అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.