అక్షరటుడే, వెబ్డెస్క్: Heavy Floods | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కుండపోత వానతో వరదలు ముంచెత్తాయి. దీంతో తీవ్ర నష్టం వాటిల్లింది. కామారెడ్డి (Kamareddy), మెదక్ (Medak), నిర్మల్ Nirmal), సిరిసిల్ల జిల్లాల్లో అత్యధికంగా నష్టం జరిగింది.
వందలాది చోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి. వేలాది విద్యుత్ స్తంభాలు (electricity poles) నేలకొరిగాయి. చాలా గ్రామాల్లో ఇళ్లు కూలిపోయాయి. వరదల ధాటికి పలువురు మృతి చెందగా.. చాలా మంది గల్లంతయ్యారు. వేలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. చెరువులు తెగిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం సహాయక చర్యలను వేగవంతం చేసింది. ఇప్పటికే ఆయా జిల్లాల్లో కొట్టుకుపోయిన రోడ్లకు తాత్కాలిక మరమ్మతులు చేపడుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యకర్శి రామకృష్ణారావు (Government Chief Executive Ramakrishna Rao) అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
Heavy Floods | ప్రాథమిక నివేదిక పంపాలి
వరద నష్టంపై ప్రాథమిక నివేదిక సమర్పించాలని సీఎస్ ఆదేశించారు. దెబ్బతిన్న రోడ్లు, విద్యుత్ లైన్లు, చెరువులను వెంటనే పునరుద్ధరించాలన్నారు. మరికొన్ని రోజులు వర్షాలు పడే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. వర్షాలతో చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు నిబంధనల మేరకు పరిహారం ఇవ్వాలన్నారు.
Heavy Floods | వేగంగా మరమ్మతులు
వరదలు ముంచెత్తడంతో చాలా ప్రాంతాలో వేలాది విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. దీంతో చాలా గ్రామాలు మూడు రోజులుగా అంధకారంలో ఉన్నాయి. దీంతో విద్యుత్ శాఖ అధికారులు వేగంగా మరమ్మతు పనులు చేపడుతున్నారు. ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్రెడ్డి మాట్లాడుతు.. తమ శాఖలో ఒక్క ఉద్యోగి కూడా సెలవుపు వెళ్లొద్దని ఆదేశించామన్నారు. విద్యుత్ పునరుద్ధరణ పనులు (power restoration works) వేగంగా చేస్తున్నట్లు వెల్లడించారు.
Heavy Floods | ఆ జిల్లాల్లో..
కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ (Nizamabad) జిల్లాల్లో విద్యుత్ స్తంభాలు కూలాయని ఆయన పేర్కొన్నారు. 4 సర్కిళ్ల పరిధిలో 108 స్తంభాలు కూలగా.. 81 స్తంభాలను పునరుద్ధరించినట్లు వరుణ్రెడ్డి వెల్లడించారు. 21 ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతినగా 17 చోట్ల మళ్లీ ఏర్పాటు చేశామన్నారు. వరద నీటిలో 86 ట్రాన్స్‌ఫార్మర్లు మునిగాయన్నారు. విద్యుత్ సరఫరా నిలిచిన గ్రామాలకు సిబ్బంది వెంటనే వెళ్తున్నట్లు ఆయన వెల్లడించారు. విద్యుత్ సిబ్బంది రాత్రిపగలు అవిశ్రాంతంగా పనిచేస్తున్నారని చెప్పారు.