ePaper
More
    HomeతెలంగాణNagarjuna Sagar | నాగార్జున సాగర్​కు పెరిగిన వరద

    Nagarjuna Sagar | నాగార్జున సాగర్​కు పెరిగిన వరద

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Nagarjuna Sagar | నాగార్జున సాగర్​ ప్రాజెక్ట్​ (Nagarjuna Sagar Project)కు వరద పెరిగింది. ప్రస్తుతం ప్రాజెక్ట్​లోకి 1,48,535 క్యూసెక్కులు ఇన్​ఫ్లో వస్తోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 547.60 అడుగులకు చేరింది. ఎగువ నుంచి వరద కొనసాగుతుండడంతో జల విద్యుత్​ కేంద్రంలో ఉత్పత్తి కొనసాగుతోంది.

    Nagarjuna Sagar | శ్రీశైలం గేట్ల మూసివేత

    ఎగువన నుంచి కృష్ణానది(Krishna River)కి వరద తగ్గుముఖం పట్టింది. దీంతో శ్రీశైలం ప్రాజెక్ట్ ​(Srisailam Project)కు ఇన్​ఫ్లో క్రమంగా తగ్గుతోంది. దీంతో అధికారులు జలాశయం మూడు గేట్లు మూసివేత మూసివేశారు. ప్రస్తుతం ప్రాజెక్ట్​లోకి 1,37,635 క్యూసెక్కుల వరద వస్తుండగా.. ఒక గేటు ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.

    మరోవైపు కుడి, ఎడమ గట్టు విద్యుత్​ కేంద్రాల ద్వారా ఉత్పత్తి చేపడుతున్నారు. దీంతో ప్రాజెక్ట్​ నుంచి 94,497 క్యూసెక్కులు ఔట్​ ఫ్లో నమోదు అవుతోంది. ప్రాజెక్ట్​ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882.70 అడుగులకు చేరింది. గేట్లు మూసివేయడంతో నాగార్జున సాగర్​కు సైతం ప్రవాహం తగ్గనుంది.

    Nagarjuna Sagar | శాంతించిన గోదావరి

    రెండు రోజులుగా ఉగ్రరూపం దాల్చిన గోదావరి(Godavari) శనివారం శాంతించింది. కాళేశ్వరం దగ్గర గోదావరి నదికి వరద తగ్గింది. మేడిగడ్డ వద్ద 7,25,050 క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తుండగా.. అన్ని గేట్లు తెరిచే ఉంచారు. దీంతో వచ్చిన నీరు వచ్చినట్లు దిగువకు వెళ్తోంది.

    More like this

    CP Sai Chaitanya | పోలీస్​ ఇమేజ్​ పెంచేవిధంగా విధులు నిర్వర్తించాలి: సీపీ సాయిచైతన్య

    అక్షరటుడే, బోధన్​: CP Sai Chaitanya | నిజామాబాద్​ కమిషనరేట్​ పరిధిలో పోలీస్​ ఇమేజ్​ను పెంచేవిధంగా సిబ్బంది విధులు...

    Alumni reunion | 14న పూర్వ విద్యార్థుల సమ్మేళనం

    అక్షరటుడే, భిక్కనూరు: Alumni reunion | మండలంలో జిల్లా పరిషత్​ బాలుర ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం...

    Yellareddy | అటవీ భూముల పరిశీలన

    అక్షర టుడే, ఎల్లారెడ్డి : Yellareddy | మండలంలోని వెల్లుట్ల (Vellutla) శివారులోని హేమగిరి ప్రాంతంలో గల అటవీ...