Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad Floods | పులాంగ్, బోర్గాం​ వాగులకు పోటెత్తిన వరద.. నీట మునిగిన శ్రీ చైతన్య...

Nizamabad Floods | పులాంగ్, బోర్గాం​ వాగులకు పోటెత్తిన వరద.. నీట మునిగిన శ్రీ చైతన్య పాఠశాల, గుడిసెలు

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad Floods : నిజామాబాద్​ జిల్లాలో భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. గురువారం (ఆగస్టు 28) ఉదయం నుంచే ఎడతెరపీయకుండా వర్షం కురుస్తోంది.

జిల్లా కేంద్రంలోనూ వర్షం దంచి కొడుతోంది. చుట్టు పక్కల గ్రామాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి. దీనికితోడు మాసాని చెరువు కూడా నిండి వరద ఏరులై పారుతోంది. దీంతో నిజామాబాద్​ నగరంలోని పులాంగ్​ వాగుకు వరద పోటెత్తింది.

Nizamabad Floods | పులాంగ్, బోర్గాం​ వాగులకు పోటెత్తిన వరద.. నీట మునిగిన శ్రీ చైతన్య పాఠశాల, గుడిసెలు
Nizamabad Floods | పులాంగ్, బోర్గాం​ వాగులకు పోటెత్తిన వరద.. నీట మునిగిన శ్రీ చైతన్య పాఠశాల, గుడిసెలు

Nizamabad Floods : వరదలో చిక్కుకుపోయిన విద్యార్థులు..

పులాంగ్​ వాగుకు పోటెత్తిన వరదతో గూపన్​పల్లి సమీపంలో జల వనరు ఉగ్రరూపం దాల్చింది. ఇక్కడి గుడిసెల్లోకి సైతం నీరు వచ్చింది.

ఇక Pulang stream వాగుకు ఆనుకుని ఉన్న శ్రీ చైతన్య పాఠశాలలోకి సైతం వరద చేరింది. వాగు బఫర్​ జోన్​లో ఈ బడి ఉండటంతో ఈ దుస్థితి నెలకొంది.

పులాంగ్​ వాగుకు పోటెత్తిన వరదతో గూపన్​పల్లి పరిధిలో ఉన్న శ్రీ చైతన్య పాఠశాల ఆవరణలోకి భారీగా వరద నీరు చేరడంతో ఇక్కడి హాస్టల్​లో ఉన్న సుమారు 70 మంది విద్యార్థులు వరదలో చిక్కుపోయారు.

విషయం తెలుసుకున్న పోలీసులు POLICE ఘటనా స్థలికి చేరుకున్నారు. రెస్క్యూ బృందంతో విద్యార్థులను రక్షించి, సమీపంలోని వేరే పాఠశాల భవనానికి తరలించారు.

Nizamabad Floods | పులాంగ్, బోర్గాం​ వాగులకు పోటెత్తిన వరద.. నీట మునిగిన శ్రీ చైతన్య పాఠశాల, గుడిసెలు
Nizamabad Floods | పులాంగ్, బోర్గాం​ వాగులకు పోటెత్తిన వరద.. నీట మునిగిన శ్రీ చైతన్య పాఠశాల, గుడిసెలు

ఇక్కడ గూపన్​ పల్లిలో వాగును ఆనుకుని ఉన్న గుడిసెలు, ఇళ్లలోకి నీరు రావడంతో రూరల్​ పోలీసులు స్పందించారు. వారిని వాగు వరద నీటి నుంచి సురక్షితంగా బయటకు తరలించారు. ఇలా నిరాశ్రయులైన వారందరినీ గంగస్థాన్​లోని గోడౌన్​లో ఏర్పాటు చేసిన తాత్కాలిక షెల్టర్​లో ఆశ్రయం కల్పించారు.

Nizamabad Floods : బ్యాంకు కాలనీలో..

అటు పాంగ్రా – బోర్గాం వాగుకు సైతం భారీగా వరద (heavy flooding) రావడంతో ఉగ్రరూపం దాల్చింది. దీంతో బోర్గాం(పీ) వద్ద వాగుకు ఆనుకుని ఉన్న గుడిసెలు నీట మునిగాయి.

ఇక్కడి బ్యాంకు కాలనీ Bank Colony లో నాలా పక్కన ఉన్న సుమారు 15 కుటుంబాల గుడిసెలు నీట మునిగాయి. సుమారు 40 మంది నిరుపేదలు నిరాశ్రయులయ్యారు.

విషయం తెలిసిన వెంటనే పోలీస్​ కమిషనర్ సాయి చైతన్య (Police Commissioner Sai Chaitanya) స్పందించారు.

సీపీ CP ఆదేశాల మేరకు నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకటరెడ్డి ఆధ్వర్యంలో నగర సీఐ శ్రీనివాస్ రాజు, నాలుగో టౌన్ ఎస్సై శ్రీకాంత్, ఉదయ్, సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొన్నారు.

శివాజీ సమితి, స్థానికుల సహాయంతో జల దిగ్బంధంలో చిక్కుకున్న వారిని బింగీ ఫంక్షన్​ హాల్​లో ఏర్పాటు చేసిన తాత్కాలిక షెడ్డుకు తరలించారు. బాధితులకు పండ్లు పంపిణీ చేశారు.

Must Read
Related News