అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Godavari River | కృష్ణమ్మ పరవళ్లకు.. గోదావరి (Godavari) జలసవ్వడులు తోడయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లోని ఈ రెండు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కాళేశ్వరం దగ్గర గోదావరి ప్రవాహం పెరుగుతోంది. ఎగువన మహారాష్ట్ర(Maharashtra)లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో గోదావరి ఉపనదులైన సీలేరు, పెన్‌గంగా, శబరి ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఆ నీరు గోదావరిలో కలుస్తుండడంతో కాళేశ్వరం ప్రాజెక్ట్ (Kaleshwaram Project) దగ్గర గోదావరి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే వరద ఉధృతికి రెండు జ్ఞానదీపాలు కొట్టుకుపోయే పరిస్థితి నెలకొంది. సరస్వతి ఘాట్ దగ్గర ప్రస్తుతనీటిమట్టం 10.5 మీటర్లుగా ఉంది. పోలవరం ప్రాజెక్ట్ నుంచి రెండు లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు.
Godavari River | ఎగువన వెలవెల
కాళేశ్వరం వద్ద ఉప్పొంగి ప్రవహిస్తున్న గోదావరి.. ఎగువన వెలవెలబోతోంది. తెలంగాణలోని ప్రాజెక్ట్‌లు అన్ని ఎగువ బాగానే ఉండడంతో నీరు లేక బోసిపోయాయి. ఎగువన శ్రీరాంసాగర్ (Sriram Sagar)కు అతి స్వల్ప ఇన్‌ఫ్లో మాత్రమే వస్తోంది. బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తినప్పటికి అక్కడ వర్షాలు లేకపోవడంతో నీరు రావడం లేదు. దీంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌కు ఆరు వేల క్యూసెక్కుల స్వల్ప ఇన్‌ఫ్లో మాత్రమే నమోదు అవుతోంది. మరోవైపు ఎస్సారెస్పీ దిగువన గల ఎల్లంపల్లిలో కూడా నీరు లేదు. లోయర్ మానేరు (Lower Maner), మిడ్ మానేరు (Mid Maner) ప్రాజెక్ట్‌లు కూడా నీరు లేక బోసిపోయాయి. మంజీరకు కూడా వరద లేకపోవడంతో సింగూరు, నిజాంసాగర్ ప్రాజెక్ట్‌లు కూడా వెలవెలబోతున్నాయి.
Godavari River | కృష్ణమ్మ పరవళ్లు
ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణానదికి ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఆ నదిపై గల ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయి. కర్ణాటక (Karnataka)లోని ఆల్మట్టి, తుంగభద్ర, నారాయణ్‌పూర్ డ్యాంల నుంచి కృష్ణకు భారీ వరద వస్తోంది. జురాల ప్రాజెక్ట్ (Jurala Project) ఇప్పటికే నిండడంతో వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్ట్ (Srisailam Project)కు కూడా భారీగా వరద వస్తుండడంతో గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమ గట్టు విద్యుత్ కేంద్రాల ద్వారా కరెంట్ ఉత్పత్తి కొనసాగుతోంది. దీంతో నాగర్జున సాగర్‌కు కూడా భారీ ఇన్‌ఫ్లో వస్తోంది. వరద ఇలాగే కొనసాగితే నాగర్జున సాగర్ మరో వారం, పది రోజుల్లో నిండే అవకాశం ఉంది.