అక్షరటుడే, మెండోరా: Sriram sagar | తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు (Sriramsagar project) వరద భారీగా వస్తోంది. జిల్లాలో వర్షాల మోస్తారుగా కురుస్తున్నప్పటికీ ఎగువ మహారాష్ట్రలో భారీ వర్షాల (heavy rains) నేపథ్యంలో ప్రాజెక్టులోకి భారీగా ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది.
Sriram sagar | ప్రాజెక్టు 40గేట్ల ఎత్తివేత..
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 40 గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ప్రస్తుతం జలాశయంలోకి 1,52,225 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. అవుట్‌ఫ్లో 3,01,321 అవుట్ ఫ్లో ఉంది. ఇన్‌ఫ్లో క్రమంగా పెరుగుతూ ఉండడంతో ప్రాజెక్టు 40 గేట్లను ఎత్తినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులు (81 టీఎంసీలు) కాగా.. ప్రస్తుతం 1088.70 అడుగుల (72.23 టీఎంసీలు) మేర నీరు నిల్వ ఉంది.
Sriram sagar | కాల్వల ద్వారా నీటివిడుదల..
ఎస్సారెస్పీ (srsp) నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తుండడంతో పాటు వరద కాల్వలకు కూడా నీటిని విడుదల చేస్తున్నారు. వరద కాలువ ద్వారా 6,735 క్యూసెక్కులు, కాకతీయ కాలువ ద్వారా 5,500 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు.
అలాగే ఎస్కేప్ గేట్ల ద్వారా 2,500 క్యూసెక్కులు, సరస్వతి కాలువ ద్వారా 400, లక్ష్మి కాలువ ద్వారా 200 క్యూసెక్కులు, అలీసాగర్ ద్వారా 180 క్యూసెక్కులు వెళ్తోంది. మిషన్ భగీరథకు (Mission Bhagiratha 231 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. 709 క్యూసెక్కుల నీరు ఆవిరైపోతోంది. మొత్తం 3, 01,321 క్యూసెక్కుల నీరు విడుదల అవుతోంది. అయితే గుత్ప ఎత్తిపోతలలకు నీటి విడుదల నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు.
Sriram sagar | అప్రమత్తంగా ఉండాలి..
ప్రాజెక్టు దిగువన గోదావరి నది పరిసర ప్రాంతాల్లోని ప్రజల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. పశువుల కాపర్లు, చేపలు పట్టేవారు రైతులు, సామాన్యప్రజలు గోదావరి నదిని దాటే ప్రయత్నం చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు.