అక్షరటుడే, ఆర్మూర్: Heavy Rains | భారీ వర్షాల కారణంగా వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. జిల్లాలో పలుచోట్ల లోలెవెల్ వంతెనలపై (Lowlevel Bridge) నుంచి వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలు స్తంభించిపోయాయి. అధికారులు సైతం భారీగా వరద ప్రవహిస్తున్న రహదారులపై రాకపోకలు సాగించకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.
Heavy Rains | ఆలూర్, గుత్ప రహదారిపై..
భారీవర్షంతో ఆలూరు గుత్ప రహదారిపై (Aloor Guthpa Road) వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. మండలంలో గురువారం వేకువజామున కురిసిన భారీ వర్షంతో వాగుల వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరదనీరు పూర్తిగా రోడ్డుపైకి చేరడంతో తాత్కాలికంగా ఆలూరు, గుత్ప రహదారిని అధికారులు మూసివేశారు. ప్రస్తుతం వరద ఉధృతి అధికంగా ఉన్నందున వంతెనపై వాహనదారులు ఎవరూ ప్రయాణం చేయవద్దని సూచించారు.

