More
    HomeతెలంగాణSriram Sagar | శ్రీరాంసాగర్​కు పెరిగిన వరద

    Sriram Sagar | శ్రీరాంసాగర్​కు పెరిగిన వరద

    Published on

    అక్షరటుడే, ఆర్మూర్​ : Sriram Sagar | రాష్ట్రవ్యాప్తంగా నాలుగైదు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ (North Telangana)లో భారీ వర్షాలు పడుతున్నాయి. నిజామాబాద్​(Nizamabad), నిర్మల్ (Nirmal)​ జిల్లాల్లో కురిసిన వర్షానికి శ్రీరామ్​ సాగర్​ ప్రాజెక్ట్​కు స్వల్పంగా ఇన్​ఫ్లో పెరిగింది. నిన్నటి వరకు రెండు వేల నుంచి మూడు వేల క్యూసెక్కుల వరద రాగా.. శనివారం ఉదయానికి 4,500 క్యూసెక్కులకు పెరిగింది. ప్రాజెక్ట్​ నుంచి కాకతీయ ప్రధాన కాలువకు 100 క్యూసెక్కులు, మిషన్​ భగీరథకు 231కు వదులుతున్నారు.

    ఎస్సారెస్పీ పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులు (80.5 టీఎంసీలు) కాగా శనివారం ఉదయం 9 గంటల వరకు ప్రాజెక్ట్​లో 1069.1 అడుగుల (21.882 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది. కాగా గతేడాది ఇదే సమయానికి జలాశయంలో 27.579 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

    Sriram Sagar | మహారాష్ట్రలో వర్షాలు పడితేనే..

    ఎగువన మహారాష్ట్రలో గోదావరి (Godavari) నదిపై నిర్మించిన బాబ్లీ ప్రాజెక్ట్​ గేట్లను అధికారులు జులై 1న ఎత్తారు. అయితే ఎగువన వర్షాలు లేకపోవడంతో వరద రావడం లేదు. స్థానికంగా కురుస్తున్న వానలతోనే స్వల్ప ఇన్​ఫ్లో నమోదవుతోంది. మహారాష్ట్రలో భారీ వర్షాలు పడితేనే ప్రాజెక్ట్​లోకి భారీ వరద రానుంది. ఏటా ఆగస్టులో ప్రాజెక్ట్​లోకి భారీగా ఇన్​ఫ్లో వస్తుంది. దీంతో ఈ ఏడాది కూడా ఆగస్టులోనే ప్రాజెక్ట్​ నిండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

    ప్రాజెక్ట్ నిండితే వరద గేట్లను ఎత్తి ఎల్లంపల్లి ప్రాజెక్ట్ (Yellampalli Project)​కు నీటిని వదులుతారు. అలాగే వరద కాలువ ద్వారా మిడ్​మానేరు (Mid Maneru), లోయర్​ మానేర్ డ్యామ్ (LMD)​లకు నీటిని తరలిస్తారు. ప్రస్తుతం ఎగువన గోదావరికి వరద లేకపోవడంతో ఎస్సారెస్పీతో పాటు ఎల్లంపల్లి, మిడ్​మానేరు, లోయర్​ మానేర్​ ప్రాజెక్ట్​లు నీరు లేక బోసిపోతున్నాయి. మరోవైపు దిగువన కాళేశ్వరం వద్ద మాత్రం గోదావరి ఉధృతంగా పారుతోంది. లక్షల క్యూసెక్కుల నీరు సముద్రం పాలు అవుతోంది.

    More like this

    CPM Nizamabad | తెలంగాణ సాయుధ పోరాట వారసులు కమ్యూనిస్టులు

    అక్షరటుడే, ఇందూరు: CPM Nizamabad | తెలంగాణ సాయిధ పోరాట వారసులు కమ్యూనిస్టులు మాత్రమేనని సీపీఎం జిల్లా కార్యదర్శి...

    Team India | టీమిండియాకి కొత్త స్పాన్స‌ర్ వ‌చ్చేశారు.. ఇక నుండి జెర్సీలు ఎలా ఉండ‌నున్నాయంటే..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Team India | భారత క్రికెట్ ప్రేమికులకు తాజా అప్‌డేట్! టీమిండియా క్రికెట్ జెర్సీపై ఇకపై...

    Birkur | గుడి డబ్బులు వడ్డీతో సహా చెల్లిస్తా: బీర్కూర్ మాజీ జెడ్పీటీసీ ద్రోణవల్లి సతీష్

    అక్షరటుడే, బాన్సువాడ: Birkur | బీర్కూర్ తెలంగాణ తిరుమల దేవస్థానానికి (Telangana Tirumala Tirupathi) సంబంధించి రూ.25 లక్షలు...