అక్షరటుడే, వెబ్‌డెస్క్: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు (Nagarjuna Sagar project) వదర కొనసాగుతోంది. ఇప్పటికే ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టంతో ఉండడంతో రెండు గేట్లకు ఎత్తివేశారు. మిగులు జలాలను కిందకు వదులుతున్నారు. ఎగువన ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో పాటు ప్రాజెక్టుల నుంచి విడుదల చేసిన నీటితో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది.
నిజాంసాగర్ ప్రాజెక్టు (Nizamsagar project) పూర్తి సామర్థ్యంతో (312 టీఎంసీలు) నిండుకుండలా మారింది. సాగర్‌కు 60 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండడంతో రెండు గేట్లను ఎత్తారు. 44,985 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. విద్యుదుత్పత్తి కోసం 28 వేల క్యూసెక్కులు, క్రస్టు గేట్ల ద్వారా 16,200 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు.
Nagarjuna Sagar : జూరాల ప్రాజెక్టుకు భారీగా ఇన్‌ఫ్లో
మరోవైపు, ఎగువన ఉన్న జూరాల ప్రాజెక్టుకు (Jurala project) కూడా భారీగా వరద వచ్చి చేరుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో 1.50 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. జూరాల ప్రాజెక్టు పూర్తి సామర్థ్యంతో (9.05 టీఎంసీలు) నిండుకుండలా మారింది. దీంతో 1.68 లక్షల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు.
Nagarjuna Sagar : బోసిపోయిన గోదావరి
కృష్ణమ్మ (Krishnama) పరుగులు పెడుతుంటే, గోదావరి (Godavari) మాత్రం బోసిపోయింది. మహారాష్ట్రలో (Maharashtra) భారీ వర్షాలు లేకపోవడంతో వరద రావడం లేదు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో (Sri Ramsagar project) 23వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులు (80 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 1078.70 అడుగులు (41.698 టీఎంసీలు)కు చేరింది.