Homeజిల్లాలుకామారెడ్డిSriram Sagar | ఎస్సారెస్పీలోకి కొనసాగుతున్న వరద.. నాలుగు గేట్లు ఎత్తివేత

Sriram Sagar | ఎస్సారెస్పీలోకి కొనసాగుతున్న వరద.. నాలుగు గేట్లు ఎత్తివేత

Sriram Sagar | ఉమ్మడి జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులైన శ్రీరామ్​సాగర్​, నిజాంసాగర్​కు వరద కొనసాగుతోంది. దీంతో అధికారులు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.

- Advertisement -

అక్షరటుడే, మెండోరా : Sriram Sagar | శ్రీరామ్​ సాగర్​ ప్రాజెక్ట్​(Sriram Sagar Project)లోకి ఎగువ నుంచి వరద నీరు కొనసాగుతోంది. దీంతో అధికారులు నాలుగు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.

ఎస్సారెస్పీ(SRSP)లోకి ప్రస్తుతం 22,290 క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తోంది. నాలుగు వరద గేట్ల ద్వారా 12,500 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ఎస్కేప్​ గేట్ల ద్వారా 3 వేలు, కాకతీయ కాలువ(Kakatiya Canal)కు 5 వేలు, సరస్వతి కాలువకు 650, లక్ష్మి కాలువకు 200 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్​లో 80.5 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

Sriram Sagar | నిజాంసాగర్​లోకి..

అక్షరటుడే, ఎల్లారెడ్డి : నిజాంసాగర్​ ప్రాజెక్ట్​(Nizamsagar Project)లోకి 12,662 క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తోంది. వరద గేట్ల ద్వారా 12,362 క్యూసెక్కులు నదిలోకి విడుదల చేస్తున్నారు. ప్రధాన కాలువకు 300 క్యూసెక్కులు వదులుతున్నారు. ఇన్​ ఫ్లో , ఔట్​ ఫ్లో సమానంగా ఉండటంతో ప్రాజెక్ట్​ నీటిమట్టం నిలకడగా ఉంది. ప్రస్తుతం జలాశయం పూర్తిస్థాయి నీటినిల్వతో నిండుకుండలా ఉంది.