అక్షరటుడే, మెండోరా: Sriram sagar | శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌కు (Sriramsagar Project) ఎగువ నుంచి వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో శుక్రవారం సాయంత్రం 21 గేట్లు తెరిచి గోదావరిలోకి (Godavari) నీటిని విడుదల చేశారు.
ప్రస్తుతం ప్రాజెక్టులోకి 75,394 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. 75,394 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 1091 అడుగులు (80.5 టీఎంసీలు) కాగా.. ప్రస్తుతం ప్రాజెక్టులో 1090.90 అడుగులకు (80.053 టీఎంసీలు) చేరింది.
Sriram sagar | కాల్వల ద్వారా నీటి విడుదల
ప్రాజెక్టు నుంచి కాల్వల ద్వారా నీటి విడుదలను అధికారులు కొనసాగిస్తున్నారు. కాకతీయ కాలువ (Kakatiya kaluva) ద్వారా 4,000 క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల ద్వారా 4,000 క్యూసెక్కులు, సరస్వతి కాలువ ద్వారా 650 క్యూసెక్కులు, లక్ష్మి కాలువ ద్వారా 200 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
నిజాంసాగర్‌లోకి వరద..
అక్షరటుడే, ఎల్లారెడ్డి : నిజాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి (Nizamsagar Project) ఎగువ నుంచి ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. జలాశయంలోకి ప్రస్తుతం 75,394 క్యూసెక్కుల వరద వస్తుండగా.. అధికారులు 5 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
నిజాంసాగర్‌కు వరద వస్తుండడంతో వరద గేట్ల ద్వారా 40,680 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1405.00 అడుగులు (17.8 టీఎంసీలు) కాగా.. ప్రస్తుతం 1405.00 అడుగుల (17.8 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది.
పోచారం ప్రాజెక్టులోకి..
పోచారం ప్రాజెక్టులోకి వరద కొనసాగుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు జలాశయంలోకి ప్రస్తుతం 1182 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో వస్తోంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 25.645 టీఎంసీల నుంచి ప్రాజెక్టులోకి వచ్చిందని అధికారులు పేర్కొన్నారు.