ePaper
More
    HomeతెలంగాణSriram Sagar | శ్రీరామ్​సాగర్​కు కొనసాగుతున్న వరద.. 16 గేట్లు ఎత్తివేత

    Sriram Sagar | శ్రీరామ్​సాగర్​కు కొనసాగుతున్న వరద.. 16 గేట్లు ఎత్తివేత

    Published on

    అక్షరటుడే, ఆర్మూర్ : Sriram Sagar | ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయని శ్రీరామ్​సాగర్​ ప్రాజెక్ట్​ (SRSP)కు వరద కొనసాగుతోంది. ఎగువ నుంచి జలాశయంలోకి ప్రస్తుతం 78 వేల క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తోంది.

    ఎస్సారెస్పీ పూర్తి స్థాయి నీటిమట్టం 1091 (80.5 టీఎంసీలు) అడుగులు కాగా.. ప్రస్తుతం 1090.7 (79.2టీఎంసీల) అడుగుల మేర నీరు నిల్వ ఉంది. ఎగువ నుంచి వదర కొనసాగుతుండటంతో 16 గేట్లను ఎత్తి అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. వరద గేట్ల (Flood Gates) ద్వారా 49,280 క్యూసెక్కులు గోదావరి (Godavari)లోకి వదులుతున్నారు.

    Sriram Sagar | కాలువల ద్వారా

    శ్రీరామ్​సాగర్​​ నుంచి కాలువల ద్వారా నీటి విడుదల కొనసాగుతోంది. ప్రాజెక్ట్​ కింద లక్షల ఎకరాల్లో పంటలు సాగు అవుతుండగా.. ఆయకట్టుకు నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయం ఎస్కేప్ గేట్ల ద్వారా 4,500 క్యూసెక్కులు, కాకతీయ ప్రధాన కాలువ (Kakatiya Canal)కు 3,500, వరద కాలువకు 20వేలు, లక్ష్మి కాలువకు 150, సరస్వతి కాలువకు 500 క్యూసెక్కుల నీరు వదులుతున్నారు. మిషన్ భగీరథకు 231క్యూసెక్కులు వదులుతుండగా, 651క్యూసెక్కుల నీరు ఆవిరి రూపంలో పోతోంది. ప్రాజెక్ట్​ నుంచి 78,812 క్యూసెక్కుల ఔట్​ ఫ్లో నమోదు అవుతోంది.

    Sriram Sagar | మిడ్​మానేరుకు జలకళ

    వరద కాలువ (Flood Canal) ద్వారా నీటి విడుదల కొనసాగతుండగటంతో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మిడ్​ మానేరు (Mid Manair) జలకళను సంతరించికుంది. గత నాలుగు రోజులుగా వరద కాలువ ద్వారా మిడ్​ మానేరుకు 20 వేల క్యూసెక్కులు తరలిస్తున్నారు. గాయత్రి పంప్​ హౌస్​ నుంచి 3,150 క్యూసెక్కులు మిడ్​ మానేరులోకి ఎత్తిపోతుస్తున్నారు. దీంతో జలాశయం నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ప్రాజెక్ట్​ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 25 టీఎంసీలు కాగా ప్రస్తుతం 17 టీఎంసీలకు చేరింది.

    Sriram Sagar | అప్రమత్తంగా ఉండాలి

    శ్రీరామ్​సాగర్​ నుంచి వరద గేట్లు, కాలువల ద్వారా నీటి విడుదల కొనసాగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏఈఈ కొత్త రవి సూచించారు. వరద పెరిగితే గోదావరిలోకి నీటి విడుదలను పెంచే అవకాశం ఉందన్నారు. నది పరీవాహక ప్రజలు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. అలాగే వదర కాలువకు భారీగా నీటిని వదులుతుండటంతో కాలువ సమీపంలోకి వెళ్లొద్దన్నారు.

    ప్రాజెక్ట్​ గేట్లు ఎత్తడంతో చూడటానికి పర్యాటకులు భారీగా తరలి వస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి భారీగా ప్రజలు వస్తుండటంతో ఎస్సారెస్పీ సందడిగా మారింది. అయితే అధికారులు వదర గేట్లు ఉన్న ప్రాంతంలోకి ఎవరిని అనుమించడం లేదు. దీంతో పర్యాటకులు ఆనకట్ట మీద నుంచి గోదావరి జల పరవళ్లు చూసి ఎంజాయ్​ చేస్తున్నారు. ఆనకట్ట దిగువన గల పార్క్​లో పిల్లలతో సందడిగా గడుపుతున్నారు.

    Latest articles

    Gold Price on August 24 | ప‌సిడి ప్రియుల‌కు పండుగ లాంటి వార్త‌.. నేడు ధ‌ర‌లు ఎలా ఉన్నాయంటే..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Price on August 24 : పెళ్లిళ్లు, శుభకార్యాలు, పండుగలు వ‌స్తున్నాయంటే మనకు ముందుగా...

    Gardening | ఇంటి ఆవరణలో మొక్కలు పెంచుతున్నారా.. ఈ జాగ్రత్తలు పాటిస్తే బాగా పెరుగుతాయ్​..

    అక్షరటుడే, హైదరాబాద్: Gardening | గార్డెనింగ్ (Gardening) అనేది మనసుకు ప్రశాంతతనిచ్చే ఒక గొప్ప హాబీ. ముఖ్యంగా వర్షాకాలంలో...

    August 24 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    August 24 Panchangam : తేదీ (DATE) – 24 ఆగస్టు​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం (Sri Vishwa...

    SR Pharma Company | SR ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం.. చౌటుప్పల్​లో ఘటన..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: SR Pharma Company : యాదాద్రి భువనగిరి జిల్లా(Yadadri Bhuvanagiri district)లో భారీ అగ్ని సంభవించింది. చౌటుప్పల్...

    More like this

    Gold Price on August 24 | ప‌సిడి ప్రియుల‌కు పండుగ లాంటి వార్త‌.. నేడు ధ‌ర‌లు ఎలా ఉన్నాయంటే..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Price on August 24 : పెళ్లిళ్లు, శుభకార్యాలు, పండుగలు వ‌స్తున్నాయంటే మనకు ముందుగా...

    Gardening | ఇంటి ఆవరణలో మొక్కలు పెంచుతున్నారా.. ఈ జాగ్రత్తలు పాటిస్తే బాగా పెరుగుతాయ్​..

    అక్షరటుడే, హైదరాబాద్: Gardening | గార్డెనింగ్ (Gardening) అనేది మనసుకు ప్రశాంతతనిచ్చే ఒక గొప్ప హాబీ. ముఖ్యంగా వర్షాకాలంలో...

    August 24 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    August 24 Panchangam : తేదీ (DATE) – 24 ఆగస్టు​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం (Sri Vishwa...