అక్షరటుడే, మెండోరా: Irrigation projects | ఉమ్మడి జిల్లాలో ప్రాజెక్టులకు వరద కొనసాగుతూనే ఉంది. మహారాష్ట్రలో వర్షాలు (Maharashtra Rains) తగ్గుముఖం పట్టకపోవడంతో బాబ్లీ మీదుగా శ్రీరాంసాగర్‌కు వరద పోటెత్తుతోంది. అలాగే ఎగువన సింగూరు నుంచి నిజాంసాగర్‌కు వరద వస్తోంది. దీంతో జలశయాలు నిండుకుండల్లా ఉన్నాయి.
Irrigation projects | ఎస్సారెస్పీలోకి..
ఎస్సారెస్పీ (SRSP)లోకి ఎగువ నుంచి వరద వస్తుండడంతో మంగళవారం ఉదయం 6 గేట్లు ఎత్తి అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,091 అడుగులు (80.5 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 1091 అడుగులకు (80.051 టీఎంసీలు) చేరింది. జలాశయంలో నిల్వలు పూర్తిస్థాయికి చేరుకున్నాయని అధికారులు తెలిపారు. ఇన్‌ఫ్లో 28,204 క్యూసెక్కులు వస్తున్న నేపథ్యంలో.. అంతేమొత్తంలో దిగువకు వదులుతున్నారు.
Irrigation projects | కాలువల ద్వారా..
ప్రాజెక్టులోకి వరదనీరు భారీగా చేరుతున్న నేపథ్యంలో ప్రాజెక్టు నుండి వివిధ కాల్వల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. ఎస్కేప్ గేట్ల ద్వారా 8,000 క్యూసెక్కులు, సరస్వతి కాలువ ద్వారా 650 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు వదులుతున్నారు. అలాగే 573 క్యూసెక్కుల నీరు ఆవిరిగా పోతోంది. కాకతీయ (kakatiya kaluva), లక్ష్మీ కాలువలకు (laxmi Kaluva) నీటిని విడుదలను నిలిపివేశారు.
Irrigation projects | నిజాంసాగర్‌లో..
నిజాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి (Nizamsagar Project) ఎగువ నుంచి ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. జలాశయంలోకి ప్రస్తుతం 11,929 క్యూసెక్కుల వరద వస్తుండగా.. అధికారులు 2 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
వరద గేట్ల ద్వారా 8,096 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులు (17.802 టీఎంసీలు) కాగా.. ప్రస్తుతం 1,404 అడుగులు (17.788 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది. కాగా ఎగువన సింగూరు నుంచి ప్రవాహం కొనసాగుతూనే ఉంది.
