అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Rajasthan | ఉత్తర భారత దేశంలో కొన్ని రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. క్లౌడ్‌బరస్ట్ (cloudburst), మెరుపు వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాజస్థాన్‌లో కురుస్తున్న వర్షాలతో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.
వర్షాలతో రాజస్థాన్‌లోని సుర్వాల్ జలాశయానికి (Surwal reservoir) భారీగా వరద వచ్చింది. దీంతో ప్రాజెక్ట్ పొంగి పొర్లింది. ఫలితంగా సవాయ్ మాధోపుర్ గ్రామంలో రెండు కిలోమీటర్ల మేర భారీ గొయ్యి ఏర్పడింది. చూడటానికి జలపాతంలా కనిపిస్తున్న ఈ గొయ్యితో సవాయ్ మాధోపుర్ గ్రామానికి (Sawai Madhopur village) రాకపోకలు నిలిచిపోయాయి. పంటలు కొట్టుకుపోయాయి. రెండు కిలోమీటర్ల పొడవు, వంద అడుగుల వెడల్పు, 55 అడుగుల లోతుతో గొయ్యి ఏర్పడినట్లు అధికారులు తెలిపారు.
Rajasthan | భారీ నష్టం
వరదతో గొయ్యి ఏర్పడటంతో తీవ్ర నష్టం వాటిల్లింది. వందలాది ఎకరాల్లో పంటలు కొట్టుకుపోయాయి. రెండు ఇళ్లు, పలు దుకాణాలు, ఆలయాలు కూలిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు (Rescue operations) చేపడుతున్నారు. వర్షాలు ఇలాగే కొనసాగితే మరింత ప్రమాదం పొంచి ఉందని అధికారులు పేర్కొన్నారు. దీంతో సమీపం ప్రాంతంలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
Rajasthan | వరదలతో ఇబ్బందులు
ఉత్తర భారతంలో (North India) వరదలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల ఉత్తరాఖండ్‌లోని రెండు గ్రామాల్లో క్లౌడ్ బరస్ట్ అయి వరదలు ముంచెత్తిన విషయం తెలిసిందే. ఆకస్మిక వరదలతో ధరాలి గ్రామం కొట్టుకుపోయింది. దాదాపు 60 మంది చనిపోయారు. జమ్మూ కశ్మీర్లో సైతం ఇటీవల కుండపోత వాన పడటంతో పలువురు మృతి చెందారు. రాజస్థాన్‌లోని నిమోడా అనే గ్రామంలో వరదల ధాటికి దాదాపు 400 ఇళ్లు కూలిపోవడంతో అక్కడి ప్రజలు నిరాశ్రయులయ్యారు. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్లో రానున్న రెండు రోజులు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
View this post on Instagram