అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Uttar Pradesh | ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని కుండపోత వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. వరుసగా కురుస్తున్న భారీ వర్షాలతో వరదలు ముప్పుతిప్పలు పెడుతున్నాయి. ముఖ్యంగా వారణాసి(Varanasi), ప్రయాగ్‌రాజ్‌నగరాల్లో జనజీవనం పూర్తిగా స్తంభించింది. నదులు పొంగిపొర్లుతుండడంతో పలు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. నివాసాల మధ్య వరద నీరు ప్రవహించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక ప్రయాగ్‌రాజ్(Prayagraj) లో చోటుచేసుకున్న ఓ ఉదంతం ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
Uttar Pradesh | సేమ్ సీన్..
బాహుబలి సినిమాలో శివగామి సన్నివేశాన్ని తలపించేలా చోటు చేసుకున్న ఓ దృశ్యం అందరిని కలిచివేసింది.ఈ ఘటన ప్రయాగ్‌రాజ్‌కు దగ్గర్లోని చిన్న పట్టణం చోటా బఘాడాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే, ఓ తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్న నవజాత శిశువును ఆస్పత్రికి తరలించేందుకు ప్రాణాలను పణంగా పెట్టాడు. భుజాల వరకు నీటితో నిండిన వీధిలో, తలపై శిశువును ఎత్తుకొని, భార్యను భుజాలపై మోస్తూ నడుచుకుంటూ వెళ్తున్న ఆ దృశ్యం ప్రజలను కంటతడిపెట్టిస్తోంది. మరో వ్యక్తి ముందుకెళ్లి శిశువును తీసుకొని వెళుతుండగా, తల్లిదండ్రులు నీటిలో నానుతూ ముందుకు సాగారు.
ఈ వీడియోపై ఆమ్ ఆద్మీ పార్టీ నేత సంజయ్ సింగ్(Aam Aadmi Party leader Sanjay Singh) తీవ్రంగా స్పందించారు. “ఇది మోడీ రాజ్యంలో అభివృద్ధి? ఈ వీడియో చూస్తే ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లో పరిస్థితి ఏ స్థాయిలో ఉందో తెలుస్తుంది,” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్(Akhilesh Yadav) కూడా స్పందిస్తూ – “ప్రయాగ్‌రాజ్ అభివృద్ధి పేరుతో రూ.20 వేల కోట్లు ఖర్చు పెట్టిన యోగి ప్రభుత్వం ఇచ్చిన ఫలితం ఇదేనా?” అంటూ ప్రశ్నించారు. ప్రయాగ్‌రాజ్‌లో శనివారం అర్థరాత్రి ప్రారంభమైన వర్షం ఆదివారం ఉదయం వరకు కొనసాగింది.నగరంలో రోడ్లపై నీరు నిలిచిపోవడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. సుమారు 15-16 లక్షల మంది జనాభా తీవ్రంగా ప్రభావితమయ్యారు. సహాయ చర్యలు తగినంతగా లేవని స్థానికులు వాపోతున్నారు. వరదలకి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో యూపీ ప్రభుత్వం(UP Government) వ్యవస్థాపక వైఫల్యంపై విమర్శల దాడి ఎక్కువ అవుతుంది.
View this post on Instagram