ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిHeavy Rains | ఉమ్మడిజిల్లాలో వరదబాధితులను ఆదుకోవాలి

    Heavy Rains | ఉమ్మడిజిల్లాలో వరదబాధితులను ఆదుకోవాలి

    Published on

    అక్షరటుడే, నెట్​వర్క్​​​: ఉమ్మడి జిల్లాలో భారీ వర్షాలు ఉమ్మడి జిల్లాను అతలాకుతలం చేశాయి. వందల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. ఎంతో మంది నిరాశ్రయులయ్యారు. రోడ్లు ధ్వంసం కావడంతో పలు గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి. వర్షాల కారణంగా నిరాశ్రయులైన బాధితులను ఆదుకోవాలని విపక్షాలు, ప్రజాసంఘాలు డిమాండ్​ చేస్తున్నాయి.

    నిజాంసాగర్​లో..

    నిజాంసాగర్​: మహమ్మద్ నగర్, కామారెడ్డి జిల్లాల్లో పంటనష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 25వేల నష్టపరిహారం ఇవ్వాలని బీజేపీ జిల్లా (BJP Kamareddy) అధ్యక్షుడు నీలం చిన్నరాజులు, మాజీ ఎంపీ బీబీపాటిల్ (EX MP BB Patil), మాజీ ఎమ్మెల్యేలు అరుణతార, గంగారాం డిమాండ్​ చేశారు. మహమ్మద్ నగర్ (Mahammad Nagar) మండలంలోని బొగ్గు గుడిసె వద్ద వరదలో నష్టపోయిన కుటుంబాలను పరామర్శించారు. అనంతరం తునికిపల్లి గ్రామంలోని ఎస్సీకాలనీలో బాధిత కుటుంబాలకు నెలకు సరిపడా నిత్యావసర వస్తువులను అందజేశారు.

    నిజాంసాగర్ మండలంలోని గోర్గల్​ గేట్​ వద్ద పునరావాస కేంద్రాల్లో మర్పల్లి గ్రామానికి చెందిన వరద బాధితులను పరామర్శించారు. బొగ్గు గుడిసె (Boggu Gudise) వద్ద యాదయ్య అనే వ్యక్తి హోటల్​ను నిర్వహిస్తుండగా.. మొన్నటి వరదలో హోటల్​ కొట్టుకుపోయింది. బాధితుడు యాదయ్యకు మాజీ ఎంపీ బీబీపాటిల్​ తనవంతు ఆర్థికసాయం అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం వెంటనే నష్టనివారణ చర్యలు ప్రారంభించాలని డిమాండ్​ చేశారు. కార్యక్రమంలో బీజేపీ మండలాధ్యక్షుడు శ్రీకాంత్, ఉపాధ్యక్షుడు సతీష్, రాజు ప్రధాన కార్యదర్శి జ్ఞానేశ్వర్, కిసాన్ మోర్చా అధ్యక్షుడు పండరి, యువమోర్చా అధ్యక్షుడు సంతు, సీనియర్ నాయకులు రవిగౌడ్, లింగాల శంకర్,రాంప్రసాద్, రౌతు రాజు, పుప్పాల విఠల్, వెంకట్ రెడ్డి, కృష్ణ, పోచయ్య, శ్రీనివాస్​, సాయిబాబా, కాశీరాం, వివిధ గ్రామాల బీజేపీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.

    ఎల్లారెడ్డి, నిజాంసాగర్​లలో..

    ఎల్లారెడ్డి: భారీవర్షాలతో అతలాకుతలమైన ఎల్లారెడ్డి, నిజాంసాగర్ మండలాల్లో రైతులకు తక్షణమే ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించాలని మాజీ ఎమ్మెల్యేలు జాజాల సురేందర్​ (jajala Surender), హన్మంత్​ షిండే (Hanmanth Shinde) డిమాండ్​ చేశారు. ఈ మేరకు శనివారం ఎల్లారెడ్డి మండలంలో వరదకు కొట్టుకుపోయిన రోడ్లు, పంటపొలాలను పరిశీలించారు. రైతులకు అండగా మేమున్నామని ధైర్యం చెప్పారు.

    ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం అందించి ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. కొట్టుకుపోయిన రోడ్లను త్వరగా బాగు చేయించి రవాణా వ్యవస్థను బాగు చేయాలని వారు పేర్కొన్నారు. తెగిపోయిన చెరువులు కుంటలను వెంటనే మరమ్మతులు చేయించాలని డిమాండ్​ చేశారు. రైతులకు అన్ని విధాలా న్యాయం జరిగేలా చూస్తామని వారు పేర్కొన్నారు. వారితో పాటు స్థానిక బీఆర్​ఎస్​ నాయకులు ఉన్నారు.

    ఇందల్వాయిలో..

    ఇందల్వాయి: మండలంలోని సిర్నాపల్లి, నల్లవెల్లి, ఇందల్వాయి, రాంసాగర్ తండాల్లో సీపీఐ, సీపీఐఎంఎల్, రైతు సంఘాల నాయకులు శనివారం పర్యటించారు. అకాల వర్షాలతో చెరువులు తెగిపోయి లోతట్టు ప్రాంతంలోని పంటలు తీవ్రంగా నష్టపోయాయి. పంటపొలాల్లో ఇసుక మేటలు వేసింది. ఆయా ప్రాంతాలను పరిశీలించిన సంఘాల నాయకులు మాట్లాడుతూ.. రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్​ చేశారు. ఎకరానికి రూ.50వేల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర నాయకులు కంజర భూమయ్య, సీపీఐఎంల్​ మాస్​లైన్​ నాయకులు సాయా గౌడ్, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు రాజారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్, ఉషన్, గ్రామ రైతులు రైతులు పాల్గొన్నారు.

    నష్టపోయిన కుటుంబాలను ఆదుకోవాలి

    బాన్సువాడ: నస్రుల్లాబాద్ మండల పరిధిలో వర్షాలతో నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 25వేల నష్టపరిహారం ఇవ్వాలని బీజేపీ మండల అధ్యక్షుడు చందూరి హన్మాండ్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు మండల కేంద్రంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కూలిపోయిన ఇళ్ల స్థానంలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని, ఇళ్లు కోల్పోయిన కుటుంబాలకు నిత్యావసర సరుకులు ప్రభుత్వం అందించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఓబీసీ జిల్లా కార్యవర్గ సభ్యులు వడ్ల సతీష్, గిరిజన మోర్చా అసెంబ్లీ కన్వీనర్ శంకర్ నాయక్ మండల ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్, మండల ఉపాధ్యక్షుడు శేఖర్, పేరక రాములు, రాజు తదితరులు పాల్గొన్నారు.

    నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

    ఇందూరు: భారీ వర్షాలను నష్ట పోయిన ప్రతి ఒక్కరిని ప్రభుత్వం ఆదుకోవాలని ఏఐకేఎంఎస్‌ జిల్లా అధ్యక్షుడు వేల్పూర్‌ భూమయ్య డిమాండ్‌ చేశారు. నగరంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భారీ వర్షాలకు జిల్లాలోని 21 మండలాల్లో 42,098 ఎకరాల్లో పంటనష్టం వాటిల్లిందని అధికారులు చెబుతున్నారని, వాస్తవానికి క్షేత్రస్థాయిలో అధిక మొత్తంలో నష్టం జరిగిందన్నారు.

    సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి, పంట నష్టంపై నివేదిక తయారు చేయాలన్నారు. నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేల పరిహారం అందించాలని, ఈ ఖరీఫ్‌ పంట రుణం మాఫీ చేయాలని డిమాండ్‌ చేశారు. వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేయాలని, వంతెనలు, చెరువులను పునరుద్ధరించాలని కోరారు. సమావేశంలో న్యూ డెమోక్రసీ మండల కార్యదర్శి గంగాధర్, జిల్లా ఉపాధ్యక్షుడు సాయినాథ్, నాయకులు గంగదాస్, గంగారాం, తదితరులు పాల్గొన్నారు.

    బాధిత కుటుంబాలకు బీఆర్‌ఎస్‌ నేతల ఆర్థికసాయం

    కోటగిరి: భారీ వర్షాలకు మండలకేంద్రంలోని గంగపుత్ర కాలనీలో పలు ఇళ్లు దెబ్బతిన్నాయి. దీంతో బీఆర్‌ఎస్‌ నాయకులు శనివారం పరిశీలించారు. అద్దె ఇంట్లో ఆశ్రయం పొందుతున్న పల్లికొండ సాయిలు, అనిత దంపతులను పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. అలాగే, ప్రభుత్వం నుంచి పరిహారం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. అనంతరం రెవెన్యూ, పంచాయతీ అధికారులకు సమాచారం ఇచ్చి, వినతిపత్రం అందించారు. అలాగే గాండ్ల సాయిలు ఇల్లు కూలిపోవడంతో పరిశీలించారు.

    రూ.5వేల ఆర్థిక సహాయం అందించారు. అధికారంలో ఉన్నా.. లేకున్నా ప్రజల కోసం బీఆర్‌ఎస్‌ పనిచేస్తుందన్నారు. అధికారులు స్పందించి నేలకూలిన ఇళ్లను సర్వే చేసి బాధిత కుటుంబాలకు పరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ, బీఆర్‌ఎస్‌ మండల నాయకులు శ్రీనివాస్, కిషన్, రవికుమార్, సహకార సొసైటీ ఉపాధ్యక్షుడు గజేందర్, సమీర్, శంకర్‌ గౌడ్, బాబు పటేల్, సంతోష్, నజీర్, మహేష్‌ రెడ్డి, చిన్న అరవింద్, గౌతమ్, మామిడి నవీన్, యోగేష్, సందీప్, బోయ సంఘ అధ్యక్షుడు సాయిలు, పోశెట్టి, కుమ్మరి నాని, కుమ్మరి పోశెట్టి, గంగాధర్ పాల్గొన్నారు.

    నిజాంసాగర్​లోని బొగ్గు గుడిసె వద్ద..

    నిజాంసాగర్: భారీవర్షాలకు బొగ్గుగుడిసె ప్రాంతంలో ఉన్న హోటళ్లు, దుకాణాలు ఇతర వ్యాపార సంస్థలు పూర్తిగా కొట్టుకుపోయాయి. ఈ సమాచారం తెలుసుకున్న జుక్కల్​ మాజీ ఎమ్మెల్యే హన్మంత్​ షిండే, ఉమ్మడి జిల్లాల మాజీ జెడ్పీ ఛైర్మన్ దఫేదార్​ రాజు శనివారం ఉదయం బొగ్గు గుడిసె ప్రాంతాన్ని సందర్శించారు. నష్టపోయిన బాధితులను పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు.

    కార్యక్రమంలో బీఆర్​ఎస్​ మండలాధ్యక్షుడు సాదుల సత్యనారాయణ, మండల సీనియర్ నాయకులు దుర్గారెడ్డి, మాజీ సీడీసీ ఛైర్మన్​ గంగారెడ్డి, వైస్ ఎంపీపీ మనోహర్, రమేష్ గౌడ్, సొసైటీ ఛైర్మన్లు వాజిద్ అలీ, నరసింహారెడ్డి, మాజీ సర్పంచులు లింగాల రామచందర్, సంగమేశ్వర్ గౌడ్, లక్ష్మీనారాయణ, శ్రీనివాస్ నాయక్, లక్ష్మారెడ్డి, రాజేశ్వర్ గౌడ్, రామాగౌడ్, జీవన్, మహేందర్, మాలిష్ రాజు, మిడత సాయిలు, అఫ్జల్, రాజేశ్వర్, రాములు, బలరాం, బషీర్ తదితరులు పాల్గొన్నారు.

    ఎల్లారెడ్డిలో బీబీపాటిల్​..

    ఎల్లారెడ్డి: నియోజకవర్గంంలోని పలు వరద ప్రభావిత ప్రాంతాల్లో మాజీ ఎంపీ బీబీపాటిల్‌ శనివారం పర్యటించారు. బొగ్గు గుడిసె, అన్నాసాగర్‌ గ్రామాల్లో నీట మునిగిన దుకాణాలను పరిశీలించారు. అనంతరం బాధితులకు ఆర్థిక సహాయం అందజేశారు. అలాగే ధ్వంసమైన కల్యాణి ప్రాజెక్టును పరిశీలించారు. వర్షాలకు దెబ్బతిన్న వెంకటాపూర్‌ ప్రధాన రహదారి, ఎల్లారెడ్డి పట్టణంలో గాంధీచౌక్‌ వద్ద కూలిన హుస్సేన్‌ ఇల్లును పరిశీలించారు.

    తిమ్మాపూర్‌లో తెగిపోయిన చెరువు కట్టని పరిశీలించి, గ్రామస్థులకు మనోధైర్యాన్నిచ్చారు. ఆయన వెంట సెన్సార్‌ బోర్డు మాజీ సభ్యుడు రామకృష్ణ, బీజేపీ మండల అధ్యక్షుడు నర్సింలు, నాయకులు గంగాధర్, రాములు, నరేష్, ప్రధాన కార్యదర్శి శంకర్, మహేందర్, అశోక్, ఉపాధ్యక్షులు పోచయ్య, సాయిరెడ్డి, లక్ష్మారెడ్డి, ఆంజనేయులు, నర్సింహారెడ్డి, శ్రీనివాస్‌ రెడ్డి, తిరుపతి గౌడ్, రాములు ఉన్నారు.

    More like this

    Revanth meet Nirmala | కళాశాలల్లో అత్యాధునిక ల్యాబ్​ల ఏర్పాటుకు రూ. 9 వేల కోట్లు..!

    అక్షరటుడే, హైదరాబాద్: Revanth meet Nirmala : తెలంగాణ విద్యా రంగంలో స‌మూల‌ మార్పులు తేవ‌డానికి తాము చేస్తున్న‌...

    Nara Lokesh | కేటీఆర్​ను కలిస్తే తప్పేంటి.. ఏపీ మంత్రి లోకేష్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nara Lokesh | మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ (KTR)​ను కలిస్తే...

    Kamareddy | తల్లికి తలకొరివి పెట్టేందుకు కొడుకు వస్తే వెళ్లగొట్టిన గ్రామస్థులు.. ఎందుకో తెలుసా..?

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | తల్లిని కంటికి రెప్పలా కాపాడుకొని ఆసరాగా ఉండాల్సిన కొడుకు ఇరవై ఏళ్ల క్రితం...