అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Flood troubles | కుండపోత వర్షం కామారెడ్డి ప్రజలకు (Kamareddy People) కన్నీళ్లు మిగిల్చింది. వరదలతో పట్టణం అల్లకల్లోలంగా మారింది.
కామారెడ్డి ఎత్తయిన ప్రదేశంలో ఉంటుందని, ఇక్కడ వరదలు వచ్చే అవకాశం లేదని భావించిన ప్రజలకు భారీ వరదలు (heavy floods) ఉలిక్కిపడేలా చేశాయి.
Kamareddy Flood troubles | కబ్జాలే కారణం..
కామారెడ్డి పట్టణంలోని నిజాంసాగర్ చౌరస్తా నుంచి జీవదాన్ పాఠశాలకు వెళ్లే దారిలో 40 ఫీట్ల పొడవైన నాలాను ఆక్రమించి అక్రమంగా నిర్మాణాలు చేపట్టడం వల్లే వరదలు వచ్చాయని స్థానికులు తెలిపారు.
నిజాంసాగర్ Nizamsagar చౌరస్తా రహదారిలో శనివారం (ఆగస్టు 30) మీడియాతో మాట్లాడారు. మాస్టర్ ప్లాన్లో ఉన్న విధంగా 40 ఫీట్ల రోడ్డు ఎక్కడ ఉందని ప్రశ్నించారు.
జిల్లా కలెక్టర్, అధికార యంత్రాంగం సందర్శించి 40 ఫీట్ల నాలాలలో ఎలాంటి ఆక్రమణలు జరిగాయో చూడాలని కోరారు.
వర్షాలు పడ్డప్పుడు మాత్రమే స్పందించే యంత్రాంగం దీనికి కారకులైన వారి పైన చర్యలు తీసుకోవడంలో విఫలమైందని Kamareddy పట్టణ వాసులు వాపోయారు.
ప్రత్యక్ష నిదర్శనంగా నాలాపైన పెద్ద పెద్ద భవనాలు కట్టినట్టుగా కనిపిస్తున్నప్పటికీ ఆ వైపు తొంగి చూడటానికే అధికార యంత్రాంగం భయభ్రాంతులకు గురవుతోందన్నారు.
కోట్లాది రూపాయల ఆస్తి నష్టానికి ప్రత్యక్ష, పరోక్ష కారకులు అధికార యంత్రాంగమేనని పట్టణవాసులు ఆరోపించారు. ఇప్పటికైనా చిత్తశుద్ధితో మాస్టర్ ప్లాన్లో ఉన్న విధంగా నాలాలను సరిచేయాలన్నారు.
నాలాలను ఆక్రమించిన వారి భవనాలను తొలగిస్తే కామారెడ్డికి ముప్పు రాకుండా ఉంటుందన్నారు. బాలు, ముత్యపు చక్రపాణి, కస్వ రమేష్, గంప ప్రసాద్, కృష్ణమూర్తి, రాజశేఖర్ తదితరులున్నారు.