అక్షరటుడే, హైదరాబాద్: Flood relief funds : అతి భారీ వర్షాలు ఇటీవల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను అల్లకల్లోలం చేశాయి. వరదలు భారీ నష్టాన్ని కలిగించాయి.
ముఖ్యంగా కామారెడ్డి, మెదక్, నిర్మల్, సిద్దిపేట, సిరిసిల్ల, నిర్మల్, జగిత్యాల తదితర జిల్లాల్లో భారీ వరదలు బీభత్సం సృష్టించాయి.
రెండు రోజుల పాటు కురిసిన భారీ వర్షాల (Heavy rains) కు స్థానిక ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి. భారీ వర్షాలతో వరదలు (Flood) పోటెత్తాయి.
చెరువులు, కుంటలు నిండిపోయి పొంగ్లిపొర్లాయి. రోడ్లపై వరద చేరి చెరువులు, నదులను తలపించాయి. అనేక చోట్ల రోడ్లు ధ్వంసమయ్యాయి.
జాతీయ రహదారులపై వరదలు పొంగిపొర్లాయి. కార్లతోపాటు మనుషులు కొట్టుకుపోయారు. ఉవ్వెత్తున ముంచుకొచ్చిన వరద వల్ల 44వ నంబరు జాతీయ రహదారి మూసుకుపోయింది. పలుచోట్ల రహదారి తెగిపోవడంతో ఈ దుస్థితి ఏర్పడింది.
వరద బీభత్సం నేపథ్యంలో పోలీసులు, అధికారులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. అధికార యంత్రాంగం అంతా సహాయక చర్యల్లో తలమునకలైంది.
Flood relief funds : ఏరియల్ సర్వే..
వరద వల్ల నష్టం తీవ్రత కామారెడ్డి, మెదక్లో అధికంగా ఉండటంతో ఆయా జిల్లాల్లో వరద బీభత్సాన్ని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఏరియల్ సర్వే ద్వారా వీక్షించారు.
భారీ వర్షాలు, వరదలు సృష్టించిన బీతావహ వాతావరణాన్నిచూసి చలించిపోయారు. తక్షణం వరద నష్టం వివరాలను అందజేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.
ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లు మరుసటి రోజే నష్ట వివరాల సేకరణలో తలమునకలయ్యారు. ప్రాథమిక నివేదికను రూపొందించి రాష్ట్ర సర్కారుకు పంపించారు.
ఈ మేరకు ప్రాథమిక నివేదిక ఆధారంగా తెలంగాణ సర్కారు వరద సహాయం కింద రూ.200 కోట్లు మంజూరు చేసింది.
భారీ వరదలతో తీవ్రంగా నష్టపోయిన ఏడు జిల్లాలకు రూ.10 కోట్ల చొప్పున సర్కారు మంజూరు చేసింది. మిగిలిన 26 జిల్లాలకు రూ.5 కోట్ల చొప్పున కేటాయించింది.