అక్షరటుడే, ఆర్మూర్: Sriramsagar project | శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు (Sriramsagar project) వరద పోటెత్తుతోంది. గత రెండు మూడు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో ప్రాజెక్టుకు భారీగా వరదనీరు (heavy flood water) వచ్చి చేరుతోంది. జలాశయంలోకి ప్రస్తుతం లక్షకుపైగా క్యూసెక్కుల వరద వస్తోంది.
ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు (80.5 టీఎంసీలు) కాగా.. ప్రస్తుతం 1083.00 అడుగుల (53.62 టీఎంసీలు) మేర నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టులోకి శనివారం ఉదయం 6 గంటల వరకు 89,466 క్యూసేక్యులు, 3 గంటలకు లక్షా 4వేల 879 క్యూసెక్యులకు పెరిగింది. ఉదయం నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు వరకు ప్రాజెక్టులోకి మూడు టీఎంసీల వరద నీరు వచ్చి చేరింది. గతేడాది ఇదే సమయానికి ప్రాజెక్టులో 48.071 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టులోకి ఇదే తరహాలో వరద నీరు వస్తే రెండు, మూడు రోజుల్లో ప్రాజెక్ట్ నిండుకుండలా మారనుంది.
Sriramsagar project | హెచ్చరికలు జారీ
శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి (Sriramsagar project) వరద నీరు పెరిగే అవకాశం ఉన్నందున గోదావరి నదీ (Godavari River) పరిసర ప్రాంతాలలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రాజెక్టు ఏఈఈ కొత్త రవి తెలిపారు. పశువుల కాపర్లు, గొర్ల కాపరులు, చేపలు పట్టేవారు, రైతులు, ప్రజలు నది పరీవాహక ప్రాంతంలోకి వెళ్లవద్దని సూచించారు.
Sriramsagar project | కొనసాగుతున్న నీటి విడుదల
ప్రాజెక్టు నుంచి కాల్వలకు నీటి విడుదల కొనసాగుతోంది. కాకతీయ కాలువ ద్వారా 4వేల క్యూసెక్కులు, మిషన్ భగీరథకు (Mission Bhagiratha) 231 క్యూసెక్కులు, అలీ సాగర్ ఎత్తిపోతలకు 180 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. 541 క్యూసెక్కుల నీరు ఆవిరి రూపంలో పోతుందని ఏఈఈ కొత్త రవి తెలిపారు.