Homeజిల్లాలునిజామాబాద్​Sriram Sagar | శ్రీరామ్​ సాగర్​ ప్రాజెక్ట్​కు పోటెత్తిన వరద.. దిగువకు భారీగా నీటి విడుదల

Sriram Sagar | శ్రీరామ్​ సాగర్​ ప్రాజెక్ట్​కు పోటెత్తిన వరద.. దిగువకు భారీగా నీటి విడుదల

అక్షరటుడే, మెండోరా : Sriram Sagar | శ్రీరామ్​సాగర్​ ప్రాజెక్ట్​కు ఎగువ నుంచి వరద పోటెత్తింది. ప్రస్తుతం 2.65 లక్షల క్యూసెక్కుల ఇన్​ఫ్లో (Inflow) వస్తోంది. ఇది మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

జలాశయంలోకి భారీగా వరద (Heavy Flood) వస్తుండటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. గేట్ల ద్వారా నీటి విడుదలను పెంచారు. 39 వదర గేట్లు ఎత్తి 3,44,575 క్యూసెక్కులు మంజీరలోకి వదులున్నారు. మధ్యాహ్నం రెండు గంటల వరకు నీటి విడుదలను 4.5 లక్షల క్యూసెక్కులకు పెంచనున్నారు. దీంతో ప్రాజెక్ట్​ దిగువన గోదావరి (Godavari) పరీవాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సంబంధిత శాఖల అధికారులు ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. నదీ సమీపంలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు వెళ్లొద్దని హెచ్చరించారు.

Sriram Sagar | 60 టీఎంసీలకు చేరిన నీటిమట్టం

ప్రాజెక్ట్​లో అధికారులు మొన్నటి వరకు పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేశారు. అయితే ఎగువ నుంచి వరద ఉధృతి పెరగడంతో మూడు రోజులుగా ఇన్​ఫ్లో కంటే ఔట్​ ఫ్లో (Out Flow) అధికంగా ఉండేలా చూస్తున్నారు. దీంతో జలాశయం నీటిమట్టం వేగంగా తగ్గిపోయింది. ప్రస్తుతం ప్రాజెక్ట్​కు 2.65 లక్షల క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తుండగా మొత్తం 3,54,338 క్యూసెక్కుల ఔట్​ఫ్లో ఉంది. ప్రాజెక్ట్​ పూర్తిస్థాయి నీటి మట్టం 1091 (80.5 టీఎంసీలు) అడుగులు కాగా ప్రస్తుతం.. 1085.2 (60.1 టీఎంసీలు) అడుగుల నీరు ఉంది.

Sriram Sagar | కాలువల ద్వారా..

ప్రాజెక్ట్​ నుంచి వరద గేట్లతో పాటు కాలువల ద్వారా నీటి విడుదల కొనసాగుతోంది. ఎస్కేప్​ గేట్ల ద్వారా 4 వేల క్యూసెక్కులు, కాకతీయ కాలువకు (Kakatiya Canal) 4 వేలు, వరద కాలువకు 500, సరస్వతి కాలువకు 400, మిషన్​ భగీరథకు 231 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.

Must Read
Related News