అక్షర టుడే, డోంగ్లి : Dongli | ఎగువన మహారాష్ట్రలో శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి (Heavy Rain) లెండి వాగుకు భారీ వరద నీరు వచ్చి చేరింది. దీంతో మద్నూర్ మండలంలోని (Madnur mandal) గోజేగావ్కు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
వాగుకు అవతలి ఒడ్డున గ్రామం ఉండడంతో వరద వచ్చిన సందర్భాల్లో గ్రామానికి రాకపోకలు నిలుస్తున్నాయి. వాగుపై ఓవర్ బ్రిడ్జి లేకపోవడంతో, ఏటా వర్షాకాలంలో గ్రామ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర సమయాల్లో సమస్య మరీ తీవ్రంగా ఉంటుంది. వాగుపై ఓవర్ బ్రిడ్జ్ నిర్మించి అవస్థలు తీర్చాలని గ్రామస్థులు కోరుతున్నారు.