Homeజిల్లాలుకామారెడ్డిNizamsagar Project | వరద గేట్లను సిద్ధం చేసుకోవాలి

Nizamsagar Project | వరద గేట్లను సిద్ధం చేసుకోవాలి

- Advertisement -

అక్షరటుడే, నిజాంసాగర్‌: Nizamsagar Project | వర్షాలు ప్రారంభమైన నేపథ్యంలో నిజాంసాగర్‌ ప్రాజెక్ట్​లోకి వరదనీరు వచ్చి చేరే అవకాశముందని ఇరిగేషన్‌ ఎస్‌ఈ శ్రీనివాస్‌ అన్నారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం ప్రాజెక్ట్​ను సందర్శించారు. వరద గేట్లకు (Flood gates) కొనసాగుతున్న ఆయిల్‌ గ్రీసింగ్‌ పనులను పరిశీలించారు. వరదనీరు వచ్చి చేరితే, నీటిని దిగువకు వదిలేందుకు గేట్లను సిద్ధంగా ఉంచాలని ప్రాజెక్ట్​ అధికారులకు సూచించారు. ఆయన వెంట ప్రాజెక్ట్‌ ఎస్‌ఈ రాజశేఖర్, ఈఈ సోలోమాన్, ఏఈలు శివ, అక్షయ్, సాకేత్, ఇరిగేషన్‌ సిబ్బంది ఉన్నారు.