అక్షరటుడే, బోధన్ : SRSP Back Water | బోధన్ (Bodhan) మండలం హంగార్గా గ్రామాన్ని ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ చుట్టు ముట్టింది. గ్రామం ముంపునకు గురికావడంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) ఆదేశించారు.
దీంతో బోధన్ తహశీల్దార్ విఠల్ ఆధ్వర్యంలో సిబ్బంది గ్రామానికి చేరుకొని ప్రజలను తరలిస్తున్నారు. గ్రామంలో ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేసి గ్రామ ప్రజలను బోధన్‌లోని తమ బంధువుల ఇళ్లకు పంపిస్తున్నారు. వరద పెరిగినా ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.