అక్షరటుడే, ఆర్మూర్ : Morthad | వరద కాలువకు గండిపడి పొలాలు కొట్టుకుపోయాయి. ఈ ఘటన మోర్తాడ్ మండలంలో గురువారం ఉదయం చోటు చేసుకుంది.
Morthad | మోర్తాడ్ మండలం గాండ్లపేట్ వద్ద..
మోర్తాడ్ మండలం గాండ్లపేట్ (Gandlapet) వద్ద వరద కాలువకు గండిపడి పెద్దఎత్తున నీరు బయటకు ప్రవహిస్తోంది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి (MLA Vemula Prashanth Reddy) వెంటనే మోర్తాడ్ తహశీల్దార్‌తో ఫోన్లో మాట్లాడారు. ప్రజలకు, రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. వాగు వెంబడి గాండ్లపేట గ్రామంలోని ఎస్సీ, బీసీ పేదల పొలాలు ఉంటాయని, వరద కాలువ గండి పడి నీరు పెద్దవాగులోకి వస్తుండడంతో వాగు ఒడ్డు కోతకు గురై పంట పొలాలు ఇసుక మేటలు వేశాయని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయ శాఖ అధికారి సహకారంతో జరిగిన పంట నష్టం లెక్కలు అంచనా వేసి ప్రభుత్వానికి నివేదించాలని తహశీల్దార్‌ను ఎమ్మెల్యే ఆదేశించారు.