అక్షరటుడే, వెబ్‌డెస్క్: Flipkart Freedom sale | వార్షిక ఫ్రీడమ్ సేల్(Freedom sale)కు ఫ్లిప్‌కార్ట్(Flipkart) సైతం సిద్ధమయ్యింది. ఆగస్టు(August) ఒకటో తేదీనుంచి సేల్ ప్రారంభం కానుంది. ప్లస్(Plus), వీఐపీ మెంబర్స్‌కు 24 గంటల ముందుగానే యాక్సెస్ లభించనుంది.
స్వాతంత్ర్య దినోత్సవానికి ఈ-కామర్స్ సంస్థలు సిద్ధమవుతున్నాయి. మార్కెట్ లీడర్‌గా నిలిచేందుకు సేల్స్ పెంచుకునేందుకు ఆఫర్లు, స్పెషల్ డేస్ తో పోటీపడుతున్నాయి. ఇప్పటికే అమెజాన్(Amazon) గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ ప్రకటించగా.. ఫ్లిప్‌కార్ట్ సైతం వార్షిక ఫ్రీడమ్ సేల్‌ను ప్రకటించింది. ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు తదితర వస్తువులపై భారీ డిస్కౌంట్‌లు అందించనున్నట్లు పేర్కొంది. సేల్ ఆగస్టు ఒకటో తేదీన ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్, వీఐపీ మెంబర్స్(VIP members)కు 24 గంటల ముందుగానే అంటే జూలై 31వ తేదీనే యాక్సెస్ లభించనుంది. రష్ అవర్స్, బడ్జెట్ డీల్స్, జాక్‌పాట్ డీల్స్, ఎక్స్ఛేంజ్ ఆఫర్స్, బంపర్ అవర్స్ వంటి 78 ఫ్రీడమ్ ప్రమోషనల్ విండోలు అందుబాటులో ఉంటాయని ఫ్లిప్‌కార్ట్ చెబుతోంది.
Flipkart Freedom sale | కార్డ్ ఆఫర్స్..
ఐసీఐసీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా(Bank Of Baroda) క్రెడిట్ కార్డులపై 10 శాతం వరకు డిస్కౌంట్ లభించే అవకాశాలున్నాయి. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో 5 శాతం వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ వీఐపీ, ప్లస్ మెంబర్స్ అదనపు డిస్కౌంట్(Additional discount)లు కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. సాధారణ సేల్ ఆఫర్‌లతో పాటు ఫ్లిప్‌కార్ట్ సూపర్ కాయిన్‌లను ఉపయోగించినప్పుడు 10 శాతం వరకు తగ్గింపు కూడా లభించనుంది. బ్యాంక్ ఆఫర్లలో ఎంపిక చేసిన కొనుగోళ్లపై 15 శాతం తక్షణ డిస్కౌంట్ ఉండే అవకాశాలున్నాయి. ఫ్రీడమ్ సేల్‌కు సంబంధించి ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్ తన వెబ్‌సైట్, యాప్‌లలో మైక్రోసైట్‌ను అందుబాటులో ఉంచింది. ఆఫర్ల వివరాలను త్వరలో వెల్లడి చేసే అవకాశాలున్నాయి.