అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Flipkart Big Billion Days | ఫెస్టివ్ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ఈసారి ఫ్లిప్‌కార్ట్ పెద్ద ఎత్తున బిగ్ బిలియన్ డేస్(Big Billion Days) సేల్‌ను ప్రకటించింది. సెప్టెంబర్ 23 నుంచి ఈ సేల్ ప్రారంభం కానుండగా, ఏ తేదీ వరకు కొనసాగుతుందో మాత్రం కంపెనీ ఇంకా వెల్లడించలేదు.
అయితే, ఎప్పటిలాగే ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మరియు బ్లాక్ మెంబర్లు ముందస్తు యాక్సెస్‌ను పొందనున్నారు. ఈ సేల్‌లో iPhone 16, Samsung Galaxy S24, Motorola Edge 60 Pro వంటి హైఎండ్ స్మార్ట్‌ఫోన్లు భారీ తగ్గింపులతో అందుబాటులోకి రానున్నాయి. ఫ్లాగ్‌షిప్ ఫోన్లపై ఈ స్థాయిలో డిస్కౌంట్ రావడం వినియోగదారులకు నిజంగా భారీ గుడ్ న్యూస్. అంతేకాక, OnePlus Buds 3, ఇతర ఆడియో గ్యాడ్జెట్లు కూడా తక్కువ ధరలకే లభించనున్నాయి.
Flipkart Big Billion Days | గృహోపకరణాలపై కూడా డీల్
స్మార్ట్‌ఫోన్లతో (Smart Phones) పాటు, 55 అంగుళాల స్మార్ట్ టీవీలు, ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్లు, ఇతర గృహోపకరణాలపై కూడా సేల్‌లో స్పెషల్ డీల్స్ అందుబాటులో ఉంటాయి. ఇది కొత్త గృహోపకరణాలు కొనుగోలు చేయాలనుకునే వారికి ఒక మంచి అవకాశం.ఫ్లిప్‌కార్ట్ ఈ సేల్ కోసం Axis బ్యాంక్ మరియు ICICI బ్యాంక్లతో(ICICI Banks) భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ బ్యాంకుల డెబిట్ లేదా క్రెడిట్ కార్డులతో చెల్లింపు చేస్తే వినియోగదారులకు అదనంగా 10% డిస్కౌంట్ లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ ఇప్పటికే ప్రత్యేక మైక్రోసైట్‌ను లైవ్ చేసింది. ఇందులో డీల్స్, టైమ్ బౌండ్డ్ ఆఫర్లు, ఫెస్టివ్ రష్ అవర్స్ వంటి అన్ని వివరాలు పొందుపరిచారు. మీరు ముందుగానే మీ లిస్ట్ తయారు చేసుకుని సేల్‌ను పూర్తిగా ఉపయోగించుకోవచ్చు.
ఫ్లిప్‌కార్ట్ సేల్ అనౌన్స్‌మెంట్‌కు కొన్ని గంటల ముందు అమెజాన్ కూడా తన గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ తేదీని ప్రకటించింది. రెండు ఈ-కామర్స్ జెయింట్స్ మధ్య పోటీ రసవత్తరంగా మారబోతోంది. ఇంకెందుకు ఆలస్యం? మీరు కొత్త ఫోన్, గ్యాడ్జెట్ లేదా గృహోపకరణం కొనాలనుకుంటున్నారా? అయితే సెప్టెంబర్ 23నుండే ఫ్లిప్‌కార్ట్‌కి లాగిన్ అవ్వండి… డీల్స్ మీ కోసం రెడీగా ఉన్నాయి!