అక్షరటుడే, వెబ్‌డెస్క్: Flight Tickets | చాలా మంది పేద, మధ్య తరగతి వారు ఒక్కసారైనా విమానం ఎక్కాలని కలలు కంటారు. అయితే ఫ్లైట్ టికెట్ల ధరలు (Flight Ticket Prices) చూసి వారు తమ కలలను వాయిదా వేసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ (Air India Express) ప్రయాణికుల కోసం బంపర్ ఆఫర్ ప్రకటించింది.
దసర సందర్భంగా పేడే సేల్ పేరిట ఎయిర్ ఇండియా ప్రత్యేక స్కీమ్ (Special Scheem) తీసుకొచ్చింది. రూ.1,200 విమాన టికెట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కాగా కొంతకాలంగా ఎయిర్ లైన్స్ సంస్థలు ప్రయాణికులను ఆకట్టుకోవడానికి పండుగల సమయంలో ఆఫర్లు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తాజాగా ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికులకు (domestic and international passengers) తక్కువ ధరల్లో టికెట్లు అందుబాటులో ఉందచింది.
Flight Tickets | పేడే సేల్ లాంచ్
ఎయిరిండియా లిమిటెడ్ సబ్సిడరీ అయిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ పేడే సేల్ పేరిట ఆఫర్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా దేశీయ విమాన టికెట్ ధరలు (domestic flight ticket prices) రూ.1,200 నుంచి ప్రారంభం అవుతాయి. ఎక్స్‌ప్రెస్ లైట్ కింద ఈ ఆఫర్‌ను ప్రవేశ పెట్టింది. లాగ్‌డ్-ఇన్- మెంబర్స్‌కు ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఇతరులకు ఎక్స్‌ప్రెస్ వాల్యూ పేరిట రూ.1,300 నుంచి టికెట్ ధరలు ప్రారంభం అవుతాయి. దీనికోసం టికెట్లను ముందే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అక్టోబర్ 1 వరకు ఈ ఆఫర్ అమలులో ఉంటుంది. అక్టోబర్ 12 నుంచి నవంబర్ 30 వరకు ప్రయాణం చేసే వారు అక్టోబర్ 1లోపు టికెట్ బుక్ చేసుకుంటే ఈ ఆఫర్ వర్తిస్తుంది.
Flight Tickets | అంతర్జాతీయ ఫ్లైట్లకు..
అంతర్జాతీయ ప్రయాణికుల కోసం ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఆఫర్లు తీసుకొచ్చింది. ఎక్స్‌ప్రెస్ లైట్ ఫేర్స్ రూ. 3,724 నుంచి మొదలు అవుతాయి. ఎక్స్‌ప్రెస్ వాల్యూ రేట్లు రూ. 4,674 నుంచి అందుబాటులో ఉంటాయి. ఎయిరిండియా అధికారిక వెబ్‌సైట్, అఫీషియల్ యాప్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. అయితే ముందుగా టికెట్లు బుక్ చేసుకునే వారికి మాత్రమే ఆఫర్ వర్తిస్తుంది.