Homeతాజావార్తలుShamshabad Airport | విమానం ఆలస్యం.. శంషాబాద్​ ఎయిర్​పోర్టులో ప్రయాణికుల ఆందోళన

Shamshabad Airport | విమానం ఆలస్యం.. శంషాబాద్​ ఎయిర్​పోర్టులో ప్రయాణికుల ఆందోళన

శంషాబాద్‌ నుంచి వియత్నాం వెళ్లాల్సిన విమానం ఆలస్యం కావడంతో ప్రయాణికులు ఆందోళన చేపట్టారు. సుమారు 200 మంది ప్రయాణికులు రాత్రంతా ఎయిర్​పోర్టులో పడిగాపులు కాశారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Shamshabad Airport | శంషాబాద్‌ నుంచి వియత్నాం వెళ్లాల్సిన విమానం ఆలస్యం కావడంతో ప్రయాణికులు ఆందోళన చేపట్టారు. ఎయిర్​లైన్స్​ సిబ్బందిపై (Airline Staff) ఆగ్రహం వ్యక్తం చేశారు. రాత్రి నుంచి దాదాపు 200 మంది ప్రయాణికుల పడిగాపులు కాస్తున్నారు.

శంషాబాద్​ అంతర్జాతీయ విమానాశ్రయం (Shamshabad International Airport) నుంచి శుక్రవారం రాత్రి 11 గంటలకు విమానం వియత్నాం వెళ్లాల్సి ఉంది. వియత్నాం ఎయిర్​లైన్స్​కు చెందిన ఫ్లైట్​ కోసం టికెట్లు బుక్​ చేసుకున్న ప్రయాణికులు ఎయిర్​పోర్టుకు చేరుకున్నారు. అయితే శనివారం ఉదయం వరకు కూడా విమానం బయలుదేరకపోవడం గమనార్హం. రాత్రి నుంచి మరో గంటలో వస్తుంది అనుకుంటూ సిబ్బంది చెప్పుకొచ్చారని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Shamshabad Airport | ఎప్పుడు వెళ్తుందో..

విమానం ఎప్పుడు బయలుదేరుతుందనే విషయంపై ఎయిర్​పోర్టు అధికారులు (Airport Officers), ఎయిర్​లైన్స్​ సిబ్బంది సరైన సమాచారం ఇవ్వడం లేదు. దీంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం 11 గంటల వరకు సైతం వేచి చూశారు. రాత్రి నుంచి ఎయిర్​పోర్టులో ఇబ్బంది పడ్డామని వారు మండిపడ్డారు. విమానం (Flight) ఎప్పుడు టేకాఫ్ అయితుందో కూడా సిబ్బంది చెప్పడం లేదన్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా.. రెండు రోజుల తర్వాత మరో విమానంలో పంపుతామని చెబుతున్నారని ప్రయాణికులు పేర్కొన్నారు.

కాగా.. దేశంలోని పలు విమానాశ్రయాల్లో ఎయిర్​ ట్రాఫిక్​ కంట్రోల్​లో (Air Traffic Control)​ సాంకేతిక సమస్య తలెత్తిన విషయం తెలిసింది. ఢిల్లీ, ముంబై విమానాశ్రయాల్లోని ఏటీసీల్లో సమస్య నెలకొనడంతో వేలాది విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. తాజాగా శంషాబాద్​లో వియత్నాం ఎయిర్​లైన్స్​ విమానం ఎప్పుడు వెళ్తుందో తెలియని పరిస్థితి ఉంది.

Must Read
Related News