ePaper
More
    HomeతెలంగాణKharge Tour | ఖర్గే పర్యటన వేళ కాంగ్రెస్​కు వ్యతిరేకంగా ఫ్లెక్సీల కలకలం

    Kharge Tour | ఖర్గే పర్యటన వేళ కాంగ్రెస్​కు వ్యతిరేకంగా ఫ్లెక్సీల కలకలం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Kharge Tour | కాంగ్రెస్​ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్​ ఖర్గే(Mallikarjun Kharge) హైదరాబాద్​లోని ఎల్బీ స్టేడియం(LB Stadium)లో శుక్రవారం జరిగే సభలో పాల్గొననున్నారు. సామాజిక న్యాయ సమర భేరి పేరిట నిర్వహిస్తున్న ఈ సభకు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో పాటు కార్పొరేషన్​ ఛైర్మన్లు, కాంగ్రెస్​ గ్రామ అధ్యక్షులు హాజరు కానున్నారు.

    ఈ సభ కోసం గురువారమే ఖర్గే హైదరాబాద్(Hyderabad)​ చేరుకున్నారు. ఆయనకు సీఎం రేవంత్​రెడ్డి(CM Revanth Reddy), కాంగ్రెస్​ రాష్ట్ర ఇన్​ఛార్జి మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan)​, పీసీసీ అధ్యక్షుడు మహేశ్​ గౌడ్​(PCC president Mahesh Goud) ఘన స్వాగతం పలికారు. అయితే ఖర్గే పర్యటన సందర్భంగా నగరంలో కాంగ్రెస్​కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం కలకలం రేపింది.
    పలువురు గుర్తు తెలియని వ్యక్తులు నగరంలోని పలు ప్రాంతాల్లో ఫ్లెక్సీలు ఏర్పాట్లు చేశారు. రాత్రికిరాత్రి పలు ప్రాంతాల్లో వాటిని ఏర్పాటు చేయడం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అందులో నినాదాలు రాశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం హింసకు పాల్పడుతోందని.. రాజ్యాంగాన్ని గౌరవించడం లేదని ఫ్లెక్సీల్లో ఉంది.

    రాష్ట్రంలో ప్రజాపాలన పేరిట రాక్షస పాలన సాగుతోందని ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అంతేగాకుండా ఇటీవల రైతులకు బేడీలు వేసిన చిత్రాలతో వాటిని ఏర్పాటు చేయడం గమనార్హం. ఫ్లెక్సీల చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్​ అవుతున్నాయి.

    More like this

    Mla Prashanth Reddy | గుత్ప, చౌచ్​పల్లి హన్మంత్​రెడ్డి లిఫ్ట్​లను ప్రారంభించాలి

    అక్షరటుడే, ఆర్మూర్: Mla Prashanth Reddy | గుత్ప (Guthpa), చౌట్​పల్లి హన్మంత్​రెడ్డి లిఫ్ట్​లను (Choutpally Hanmanth Reddy...

    Non-veg Shops | ప‌ది రోజుల త‌ర్వాత మ‌ళ్లీ క‌ళ‌క‌ళ‌లాడుతున్న నాన్‌వెజ్ షాపులు.. పెరిగిన డిమాండ్, ధ‌ర‌లు స్థిరంగా

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Non-veg shops | గణేశ్ నవరాత్రుల (Ganesh Navaratri) సంద‌ర్భంగా చాలా మంది నాన్‌వెజ్‌కి దూరంగా...

    BC Declaration | బీసీ డిక్లరేషన్ సభాస్థలిని పరిశీలించిన మంత్రుల బృందం

    అక్షరటుడే, కామారెడ్డి: BC Declaration |  బీసీ డిక్టరేషన్​ అమలు సభను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు కాంగ్రెస్​ పార్టీ సమాయత్తమైంది....