అక్షరటుడే, ఇందల్వాయి: Dharmaram | డిచ్‌పల్లి మండలం (Dichpally mandal) ధర్మారం (బి) గ్రామంలో రామాలయంలో (Rama temple) శనివారం ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా పూజారులు పూజాది కార్యక్రమాలు జరిపారు.
నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి (MLA Dr. Bhupathi Reddy), మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావుతో కలిసి ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయంలో ధ్వజస్తంభం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. ప్రజలంతా భక్తి భావనతో మెలగాలని సూచించారు. ఈ పవిత్ర కార్యక్రమంలో గ్రామ పెద్దలు,యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
