అక్షరటుడే, ఇందూరు : Nizamabad | నగరంలోని జెండా బాలాజీ ఆలయ (Balaji Temple) జెండా ఊరేగింపు ఆదివారం ఉదయం ప్రారంభమైంది. ఆలయ వంశపారపర్య అర్చకులు అజయ్ సంగ్వాయి స్వగృహం పెద్ద బజారు నుంచి శోభాయాత్రను ప్రారంభించారు. ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గాజులపేట వరకు వెళ్లి తిరిగి బాలాజీ ఆలయానికి చేరుకున్నారు. కార్యక్రమంలో వంశపారపర్య అర్చకులు విజయ్ సాంగ్వాయ్, సంజయ్ సాంగ్వాయ్, ఆలయ ఛైర్మన్ ప్రమోద్, డైరెక్టర్ రాజు, ఈవో వేణు తదితరులు పాల్గొన్నారు.
Nizamabad | 15 రోజుల పాటు జాతర
జెండా జాతర 15 రోజుల పాటు జరగనుంది. నగరంలోని బాలాజీ ఆలయంలో జెండా పౌర్ణమి వరకు పూజలు అందుకోనుంది. అనంతరం ఆలయం నుంచి శోభాయాత్రగా బయలుదేరి పులాంగ్ (Pulang) సమీపంలో ప్రతిష్ఠిస్తారు. అక్కడ వారం రోజుల పాటు జెండాకు పూజలు చేస్తారు.
