అక్షరటుడే, ఇందూరు: Jenda Jathara | నగరంలోని జెండా బాలాజీ ఆలయం (Jenda Balaji Temple) జాతర ఆదివారం (ఈనెల 24) నుంచి ప్రారంభమవుతున్నట్లు వంశపారపర్య అర్చకులు అజయ్ సంగ్వాయి (Ajay Sangwai) తెలిపారు. ఉదయం 8 గంటలకు పెద్ద బజార్లోని (Pedda bazar) స్వగృహం నుంచి ఉత్సవమూర్తులను, జెండాను ఆలయానికి శోభాయాత్రగా ఊరేగించనున్నట్లు పేర్కొన్నారు.
అయితే జెండాను మోసే ఆర్మూర్ వంశీయుల్లో ఒకరు స్వర్గీయులు కావడంతో ఈసారి పురవీధుల్లో జెండా ఊరేగింపు నిర్వహించడం లేదని తెలిపారు. పెద్దబజార్ నుంచి బార్సింగ్ బాబా ఆలయం (Barsingh Baba Temple) వరకు వెళ్లి తిరిగి జెండా గుడికి వెళ్తుందన్నారు. కావున భక్తులు సహకరించి ఆలయంలోనే జెండాను దర్శించుకోవాలని కోరారు.